మహర్షి మహేష్ తో కార్తి!

Published : Feb 13, 2019, 05:20 PM IST
మహర్షి మహేష్ తో కార్తి!

సారాంశం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ పనులను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. చిత్ర యూనిట్ ను కోలీవుడ్ హీరో కార్తీ కలుసుకున్నాడు. 

మహర్షి షూటింగ్ స్పాట్ కి వెళ్లి మహేష్ తో అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లిని కలిసి బ్రేక్ లో మాట్లాడాడు. ఇంతకుముందు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఊపిరి సినిమాలో కార్తీ నటించిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో కార్తీ నటించిన దేవ్ సినిమా తెలుగు తమిళ్ లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది. 

ఈ సందర్బంగా ప్రమోషన్స్ లో తీరిక లేకుండా పాల్గొంటున్న కార్తీ మహర్షి టీమ్ ను కలిశాడు. దేవ్ సినిమాలో కార్తీ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది. కార్తీ నుంచి ఇంతకుముందు వచ్చిన చినబాబు సినిమా అనుకున్నంతగా హిట్టవ్వలేదు. దీంతో దేవ్ సినిమా హిట్టవ్వాలని కార్తీ అండ్ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొంటోంది.   

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కమన్‌ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్