ప్రభాస్ సినిమాల్లో తనకు ఇష్టమైంది ఏదో రివీల్ చేసిన నాగ్ అశ్విన్

Published : Jul 18, 2024, 10:48 AM IST
ప్రభాస్ సినిమాల్లో తనకు ఇష్టమైంది ఏదో రివీల్ చేసిన  నాగ్ అశ్విన్

సారాంశం

కల్కి ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయటంలేదు. ఇప్పుడో పోస్టర్, ఇప్పుడో పోస్టర్ వదులుతున్నారు. 

నాగ్ అశ్విన్ తాజా చిత్రతం  కల్కి 2898 ఏడీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ సొంతం చేసుకున్న సంగతితెలిసిందే.  ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. పోస్ట్ అపోకలిప్టిక్ తర్వాత మానవ మనుగడ ఎలా ఉంటుందనే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. మూడోవారంలోకు ఎంటరై...ఈ వారంలో  విడుదలైన ఇండియన్ 2, సర్ఫిరా కంటే ఎక్కువ ఫెరఫార్మ్ చేస్తోంది. 
 
ఇప్పటికే వెయ్యి కోట్ల మార్క్ ని దాటిన  ఈ చిత్రం సులభంగా  1200 కోట్లను కలెక్ట్ చేసేలా ఉందని ట్రేడ్ లో అంచనా. మరో ప్రక్క కల్కి ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయటంలేదు. ఇప్పుడో పోస్టర్, ఇప్పుడో పోస్టర్ వదులుతున్నారు. మధ్య మధ్యలో నేషనల్ మీడియాలో కల్కి గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో నాగ్ అశ్విన్ ప్రభాస్ సలార్ 2 గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రబాస్ సినిమాల్లో తనకు ఇష్టమైంది ఏదో చెప్పుకొచ్చారు. 

మీడియా ఇంటరాక్షన్ లో నాగ్ అశ్విన్ ని ...ప్రస్తుతం సలార్ 2, పుష్ప 2, సింగం సీక్వెల్స్ ఇలా దేశంలో అన్నీ పార్టులు పార్టులుగా వస్తున్నాయ్ కదా.. ఇందులో మీకు ఏది అంటే ఇంట్రెస్ట్ అని అడిగాడు. దానికి నాగ్ అశ్విన్ ఇలా  సమాధానం ఇచ్చాడు. తనకు ప్రభాస్ సలార్ 2 అంటే ఇష్టమని అన్నాడు. తనకు మామూలుగానే గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి సినిమాలంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. సలార్‌లో వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేశారు.. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉందని చెప్పుకొచ్చారు. 

ఇక ‘సలార్‌ పార్ట్‌ 1: సీజ్‌ఫైర్‌’ (Salaar: Part 1- Ceasefire) గతేడాది డిసెంబరులో విడుదలై, ప్రభాస్‌ అభిమానుల్లో జోష్‌ నింపింది. దీంతో, ‘శౌర్యాంగ పర్వం’ (shouryanga parvam) పేరుతో రూపొందనున్న పార్ట్‌ 2పై అంచనాలు నమోదయ్యాయి. పలు సినీ వెబ్‌సైట్లు ఈ మూవీ నిలిచిపోయిందని వార్తలు రాయడంతో.. ఫ్యాన్స్‌ సందేహంలో పడ్డారు. తాజా అప్‌డేట్‌తో దానికి చెక్‌ పడినట్టైంది. ఈ సినిమా స్క్రిప్టు పూర్తయిందని నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కొన్ని నెలల క్రితమే చెప్పడం గమనార్హం. హీరో, డైరెక్టర్‌ షూటింగ్‌ ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. హాలీవుడ్‌ సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ‘సలార్‌ 2’ ఉంటుందన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

3 Roses 2 OTT Review: 3 రోజెస్‌ సీజన్‌ 2 రివ్యూ.. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత బోల్డ్ సిరీస్‌ ఎలా ఉందంటే?
అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?