ముగిసిన నడిఘర్ సంఘం ఎన్నికలు.. కోర్టు తీర్పు అనంతరం ఫలితాలు

Published : Jun 23, 2019, 05:26 PM IST
ముగిసిన నడిఘర్ సంఘం ఎన్నికలు.. కోర్టు తీర్పు అనంతరం ఫలితాలు

సారాంశం

  మొత్తానికి చెన్నైలో నడిఘర్ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. విశాల్ - భాగ్యరాజ్ వర్గాలు ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికలకు పోలీసు బందోబస్తు కూడా భారీగానే ఏర్పాటు చేశారు.

మొత్తానికి చెన్నైలో నడిఘర్ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. విశాల్ - భాగ్యరాజ్ వర్గాలు ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికలకు పోలీసు బందోబస్తు కూడా భారీగానే ఏర్పాటు చేశారు. అయితే చాలా వరకు ఓటు వేయాల్సిన సినీ ప్రముఖులు ఈ ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. 

రజినీకాంత్ కూడా దర్బార్ షూటింగ్ కారణంగా ఓటు వేయడం కుదరలేదని ముందే వివరణ ఇవ్వగా మరికొంత మంది ఈ ఎన్నికలపై అసహనం వ్యక్తం చేశారు. విశాల్ మరోసారి అధ్యక్ష్య పదవిని అందుకుంటారా లేదా అనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. 

ఇక కోర్టు తీర్పు అనంతరం ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. పలు కేసుల విషయంలో విశాల్ మరికొంత మంది నడిఘర్ సంఘం ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?