నెట్ ఫ్లిక్స్ లో బాహుబలి 3

Published : Jun 23, 2019, 04:44 PM ISTUpdated : Jun 23, 2019, 04:46 PM IST
నెట్ ఫ్లిక్స్ లో బాహుబలి 3

సారాంశం

ఎన్నిసార్లు అడిగినా దర్శకుడు రాజమౌళి మళ్ళీ బాహుబలి తెరకెక్కించడం జరగదని క్లారిటీ ఇచ్చేశాడు.  అయితే బాలీవుడ్ టెక్నీషియన్స్ ద్వారా వెబ్ సిరీస్ లో ఆ కథకు ఫ్రీక్వెల్ రానుంది. 

రెండు భాగాలతో బాహుబలికి ఎండ్ కార్డ్ పెట్టేసిన జక్కన్న మరో కథను తెరకెక్కించే అవకాశం ఉందని అనేక రకాల రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నిసార్లు అడిగినా దర్శకుడు రాజమౌళి మళ్ళీ బాహుబలి తెరకెక్కించడం జరగదని క్లారిటీ ఇచ్చేశాడు. 

అయితే బాలీవుడ్ టెక్నీషియన్స్ ద్వారా వెబ్ సిరీస్ లో ఆ కథకు ఫ్రీక్వెల్ రానుంది. నెట్ ఫ్లిక్స్ బాహుబలి 3 ని రెడీ చేయడానికి సిద్ధమైంది. ఈ ప్రీక్వెల్ కు బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ అనే టైటిల్ ను సెట్ చేశారు. అనూప్ సోని కీలకపాత్రలో కనిపించనున్న ఈ సిరీస్ లో అమరేంద్ర బాహుబలి తల్లిదండ్రులు కూడా కనిపించనున్నారు. 

ఎన్నో ఆసక్తికరమైన కల్పిత ప్రశ్నలకు ఇందులో సమాధానాలు దొరుకుతాయట. ఇటీవల మీడియా సమావేశంలో అనూప్ ఈ విషయాన్నీ తెలిపారు. బాహుబలి సినిమాకు పని చేసిన చాలా మంది టెక్నీషియన్స్ ఈ సిరీస్ కి పని చేయనున్నట్లు అనూప్ తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా