
దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవడ్డంతో .. నాని ఆనందానికి హద్దులేకుండా పోయింది. న్యాచురల్ స్టార్ నాని గత కొంత కాలంగా సరైన సినిమా పడక ఇబ్బందిపడుతున్నాడు. దసరాసినిమా సూపర్ సక్సెస్ తో.. నానీలో కాన్ఫిడెంట్ రెట్టింపు అయ్యింది. అందులోను ప్రయోగాత్మక సినిమాలు.. అది కూడా కొత్త దర్శకులతో చేస్తూ.. నానీ ఇండస్ట్రీకి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లను పరిచయం చేస్తున్నాడు. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదేల ను అలాగే పరిచియం చేశాడు నాని. ఇక నేచురల్ స్టార్ నుంచి తాజాగా తెరకెక్కుతోన్న 30వ సినిమాపై అందరి దృష్టి పడింది. ఈసినిమా కూడా డెబ్యూ డైరెక్టర్ తోనే చేస్తున్నాడు నాని. శౌర్యువ్ అనే ఫ్రెషర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
నాని30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుండగా.. ఈసినిమా నుంచి అప్ డేట్ ను డిఫరెంట్గా అందించాడు నేచురల్ స్టార్. చాలా రోజుల తర్వాత ట్వీట్ ద్వారా నాని 30 అప్‌డేట్ అందించాడు ఆయన ట్వీట్ చేస్తూ... రెడీనా..? అని నాని ట్వీట్ చేసి.. బ్యాక్ గ్రౌండ్ లో.. సిల్వర్ స్క్రీన్‌పై వైరా ఎంటర్‌టైన్ మెంట్స్ డిస్ ప్లే అవుతున్న స్టిల్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు.
నానీ చేసిన ఈ డిఫరెంట్ ట్వీట్ తో ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్. అయితే మరికొంత మంది ఫ్యాన్స్ మాత్రం నాని త్వరలోనే తన 30వ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేయబోతున్నాడు.. అందుకే ఇలా రెడీనా అంటూ హింట్ ఇస్తున్నాడు అంటూ.. రకరకాలుగా చర్చించుకుంటున్నారు. దాంతో నానీ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయ్యింది. నాని 30 అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి , డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ ఈ నిర్మిస్తున్నారు.