ఇస్మార్ట్ ఎఫెక్ట్.. ఆ పోరికి అదిరిపోయే ఆఫర్!

Published : Aug 06, 2019, 02:51 PM IST
ఇస్మార్ట్ ఎఫెక్ట్.. ఆ పోరికి అదిరిపోయే ఆఫర్!

సారాంశం

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం హీరో రామ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లతో దూసుకుపోతోంది. అందాలు ఒలకబోసే హీరోయిన్లు, రామ్ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు, మణిశర్మ మ్యూజిక్ ఇలా అన్ని అంశాలు మాస్ ప్రేక్షకులని మెప్పించాయి. 

ఈ చిత్రం రామ్ కు మాస్ లో క్రేజ్ పెంచింది. పూరికి మంచి ఉత్సాహాన్నిచ్చే విజయాన్ని అందించింది. ఇక హీరోయిన్లు కూడా ఈ చిత్రంతో లాభపడ్డారు. నిధి అగర్వాల్ ఇప్పటికే మంచి అవకాశాలు అందుకుంటోంది. పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న నభా నటేష్ కు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా నభా నటేష్ ఓ తమిళ చిత్రంలో స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

హీరో ఎవరనే విషయం ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నభా నటేష్ నటించే చిత్రానికి సంబంధించిన వివరాలని ప్రకటించనుందట. నభా నటేష్ త్వరలో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా అంచనాలు మొదలయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో