పవన్ తో సినిమా ఉంటుంది.. మైత్రీ మూవీ మేకర్స్!

Published : Oct 30, 2018, 03:29 PM IST
పవన్ తో సినిమా ఉంటుంది.. మైత్రీ మూవీ మేకర్స్!

సారాంశం

టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతోన్న మైత్రీ మూవీ మేకర్స్ వారు చాలా మంది హీరోలకి, దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చారు. దాదాపు ఈ బ్యానర్ లో పది సినిమాలు లైన్ లో ఉన్నాయని నిర్మాతలే చెబుతున్నారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ వారి అడ్వాన్స్ తీసుకున్న హీరోల్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. 

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ సినిమా ఉంటుందని అన్నారు. కానీ పవన్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో ఆ కథని రవితేజతో చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి పవన్ నుండి అనుమతి కూడా తీసుకున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వెల్లడించారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పూర్తి సమయాన్ని రాజకీయాలని కేటాయించారని ఇకపై సినిమాలకి సమయం ఉండదని చెప్పినట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వెల్లడించారు. పవన్ కి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి అడిగారా..? అనే ప్రశ్నకి సమాధానంగా.. ''మేము పవన్ కళ్యాణ్ గారిని అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని అడగలేదు.

ఆయనతో సినిమా ఉంటుంది. ఎన్నికల తరువాత పవన్ సినిమా చేస్తారని ఆశిస్తున్నాం. పవన్ సినిమాపై వివాదాలు వద్దు'' అని వెల్లడించారు. త్రివిక్రమ్ తో కూడా సినిమా ఉంటుందని అందులో హీరో ఎవరనే విషయం ఆయన నిర్ణయానికి వదిలేసినట్లు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్