మొత్తం పిండేయాలని ఫిక్స్ అయిన మైత్రీ మూవీస్!

By Udaya DFirst Published Mar 11, 2019, 10:41 AM IST
Highlights

వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న మైత్రీ మూవీస్ కు ఆశాకిరణంలా కనపడుతున్నాడు విజయ్ దేవరకొండ. వరస హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'డియర్‌ కామ్రేడ్‌ ' ఈ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా చాలా రిచ్ గా నిర్మిస్తున్నారు.

వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న మైత్రీ మూవీస్ కు ఆశాకిరణంలా కనపడుతున్నాడు విజయ్ దేవరకొండ. వరస హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'డియర్‌ కామ్రేడ్‌ ' ఈ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా చాలా రిచ్ గా నిర్మిస్తున్నారు. 'యు ఫైట్‌ ఫర్‌ వాట్‌ యు లవ్‌' అనేది ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో  రష్మిక మందన్నా హీరోయిన్‌గా కావటంతో బిజినెస్ వర్గాల్లో ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అవుతోంది.

గీతా గోవిందం వంటి సూపర్ హిట్ కాంబో రిపీట్ అవటంతో  ట్రేడ్ సర్కిల్స్ లో ఈ సినిమా పెద్ద చర్చనీయాంశంగా మారింది . ఇవన్నీ చూసిన మైత్రీ మూవీస్ వారు ఈ సినిమా ను భారీ స్దాయిలో క్రేజ్ తెచ్చి, అందుకు తగ్గ బిజినెస్ చేసి తమ పాత బకాయిల నుంచి ఒడ్డున పడాలి అనే స్కెచ్ లో ఉన్నారని సమాచారం. అవకాసం ఉన్న మేరకు ఈ సినిమాను పిండుకోవాలనే కాన్సెప్టుతో బిజినెస్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. 

ఆ బిజినెస్ స్కెచ్ లో భాగంగా మార్చి 17న ‘డియర్ కామ్రేడ్’ టీజర్ విడుదల చేస్తున్నారు. అది ఒక భాషలో కాదు.. ఒకేసారి నాలుగు భాషల్లో కావడం విశేషం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ.. ఈ నాలుగు భాషల్లోనూ ఒకేసారి టీజర్ లాంచ్ చేయబోతున్నారు. అంటే ఈ నాలుగు భాషల్లోనూ ఒకేసారి సినిమా రిలీజవుతుందన్నమాట. 

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దక్షిణాదిన అంతటా విజయ్‌కి క్రేజ్ వచ్చింది. తమిళంలో అయితే అతడిని ఒక స్టార్ లాగే చూస్తున్నారు జనాలు. ఇదంతా మైత్రి మూవీస్ వారికి బాగా కలిసొచ్చే అంశం. నాలుగు భాషల డిజిటెల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీగానే చెప్తున్నారట. ఏ విషయంలోనూ వెనకడుగు వేయటం లేదని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా రిజల్ట్ తో సంభందం లేకుండా మైత్రీ మూవీస్ ..లాభపడనుందని టాక్. 

భరత్‌ కమ్మ అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని . మైత్రీ మూవీ మేకర్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్స్‌లో తెరకెక్కిస్తున్నారు. సామాజిక బాధ్యత ఉన్న ఇన్‌టెన్సివ్‌ పాత్రలో విజరు దేవరకొండ మెప్పించనున్నారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : భరత్‌ కమ్మ, నిర్మాతలు : నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌ యలమంచిలి, మోహన్‌ చెరుకూరి(సి.వి.ఎం), యష్‌ రంగినేని. 

click me!