#Hanuman నైజాం ఎంతకు కొన్నారు?..ఎంత లాభం వస్తోంది

By Surya PrakashFirst Published Jan 17, 2024, 11:40 AM IST
Highlights

 థియేటర్స్ కేటాయింపు విషయంలో అన్యాయం జరగటంతో హాట్ టాపిక్ గా మారింది. దాంతో నైజాం లో నష్టపోతారా థియేటర్స్ తక్కువ కౌంట్ కాబట్టి ఇబ్బంది వస్తుందా అని ట్రేడ్ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూసింది.
 


 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యిన  సినిమాల్లో ఒకటైన హనుమాన్ నైజాం హక్కుల కోసం మైత్రీ మూవీస్ భారీ మొత్తం వెచ్చించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ నటించిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయ్యింది. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నా, థియేటర్స్ కేటాయింపు విషయంలో అన్యాయం జరగటంతో హాట్ టాపిక్ గా మారింది. దాంతో నైజాం లో నష్టపోతారా థియేటర్స్ తక్కువ కౌంట్ కాబట్టి ఇబ్బంది వస్తుందా అని ట్రేడ్ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూసింది.

అయితే అందుతున్న లెక్కలు ప్రకారం #Hanuman నైజాం ను ₹6.3 కోట్లు పెట్టి మైత్రీ వారు తీసుకున్నారు. ఇప్పుడు 5 రోజుల షేర్ ₹11 Cr (excluding GST). ఇదే స్పీడులో దూసుకువెళ్తే లాంగ్ రన్ లో నైజాం ఏరియాలో ₹20 Cr పైనే కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే మంచి లాభాల్లో సినిమా అందచేసినట్లు అన్నమాట. 

Latest Videos

అంతెందుకు హనుమాన్ సినిమా కోసం జనవరి 11న వేసిన ప్రీమియర్లకు భారీ స్పందన వచ్చింది. జనవరి 12న గుంటూరు కారం ఉండటంతో.. ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దొరకలేదు. దీంతో జనవరి 11న సాయంత్రమే భారీ సంఖ్యలో ప్రీమియర్లు వేశారు. ఈ ప్రీమియర్ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. హైద్రాబాద్‌లోనే దాదాపు రెండొందలకు పైగా షోలు పడ్డట్టుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర స్టేట్స్‌లోని కొన్ని మెయిన్ ఏరియాల్లోనూ ప్రీమియర్లు పడ్డాయి. ఇలా ఓ సినిమాకు ప్రీమియర్లు పడటమే ఒక రికార్డ్. ఇన్ని షోలు ప్రీమియర్లు వేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క నైజాం ఏరియాలోనే ప్రీమియర్స్ నుంచి భారీ వసూళ్లు వచ్చినట్టుగా తెలుస్తోంది.ఒక్క నైజాం ఏరియాలోనే ప్రీమియర్స్ నుంచి 2.5 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టుగా సమాచారం. ఈ రేంజ్లో వసూళ్లు వచ్చాయంటే హనుమాన్‌కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 
 
 తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యిన మంచి టాక్ తెచ్చుకుని,  పిల్లలను ,  విపరీతంగా ఆకట్టుకుంటోంది.  పైగా తెలుగులో మాత్రమే కాదు.. ‘హనుమాన్’ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసాన్నారు కాబట్టి ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ భారీగానే జరిగింది.

 

click me!