ప్రభాస్ పెళ్లి పై విశాల్ కామెంట్స్... ఇద్దరికిద్దరూ సరిపోయారు!

By Sambi ReddyFirst Published Apr 18, 2024, 11:07 AM IST
Highlights

ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. తాజా హీరో విశాల్ ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తెరపైకి తెచ్చాడు. 
 

కెరీర్ కోసం పర్సనల్ లైఫ్ వదిలేస్తున్నారు హీరోలు ,హీరోయిన్స్. పెళ్లి చేసుకోవడం అంత ఇంపార్టెంట్ కాదని ఫిక్స్ అవుతున్నారు. పెళ్లి మేటర్ పక్కన పెట్టేస్తున్న సెలెబ్స్ సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. కాగా నార్త్ లో సల్మాన్ ఖాన్, సౌత్ లో ప్రభాస్ ల పెళ్లి ఎవర్ గ్రీన్ టాపిక్. మరో రెండేళ్లలో సల్మాన్ ఖాన్ 60 ఏళ్లకు చేరుకుంటాడు. కాబట్టి ఆయన ఇకపై పెళ్లి చేసుకోకపోవచ్చు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఆయన 40 ప్లస్ లో ఉన్నారు. 

పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా మాట దాటేయడమే కానీ ఒక సమాధానం చెప్పింది లేదు. చూస్తుంటే ప్రభాస్ కి ఆసక్తి లేదేమో అనే భావన కలుగుతుంది. కాగా ప్రభాస్ పెళ్లి మేటర్ మరోసారి తెరపైకి వచ్చింది. హీరో విశాల్ తన లేటెస్ట్ మూవీ రత్నం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పెళ్లి ఎప్పుడనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. ప్రభాస్ పెళ్లి తర్వాతే నా పెళ్లి అని విశాల్ మెలిక పెట్టాడు. 

మీరు నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తి కాగానే అందులో పెళ్లి చేసుకుంటాను అన్నారు కదా అని అడగ్గా... ప్రభాస్ పెళ్లి చేసుకున్నాక నా పెళ్లి ఉంటుంది. మొదటి కార్డు ఆయనకే ఇస్తాను, అన్నారు. మరోవైపు ప్రభాస్ ఏమో... సల్మాన్ పెళ్లి తర్వాత నా పెళ్లి అంటున్నాడు. చూస్తుంటే ప్రభాస్, విశాల్ కూడా సల్మాన్ మాదిరి పెళ్లి లేకుండా ఒంటరిగా ఉండిపోవాలని ఫిక్స్ అయ్యారేమో అనిపిస్తుంది. 

విశాల్ కి గతంలో ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. అనుకోని కారణాలతో ఆ వివాహం ఆగిపోయింది. ఇక విశాల్ లేటెస్ట్ మూవీ రత్నం విషయానికి వస్తే... అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు హరి తెరకెక్కించాడు. విశాల్ కి జంటగా ప్రియా భవాని శంకర్ నటించింది. ఏప్రిల్ 26న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. విశాల్ గత చిత్రం మార్క్ ఆంటోని మంచి విజయం సాధించింది. 

😅 Anna during movie promotions 😁 " anna pelli ayyaka Nen kuda pelli cheskuntanu " - pic.twitter.com/ioVpmw8fgb

— Prabhas Fan (@ivdsai)
click me!