చంపేస్తామంటూ బెదిరింపులు.. అయినా వదలని డైరెక్టర్, కాంట్రవర్షియల్ బయోపిక్ మరోసారి..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 12, 2022, 09:39 AM IST
చంపేస్తామంటూ బెదిరింపులు.. అయినా వదలని డైరెక్టర్, కాంట్రవర్షియల్ బయోపిక్ మరోసారి..

సారాంశం

సచిన్, మహేంద్ర సింగ్ ధోని, కపిల్ దేవ్ లాంటి స్టార్ క్రికెటర్స్ జీవిత చరిత్రలపై బయోపిక్ చిత్రాలు తెరకెక్కాయి. ఇదిలా ఉండగా తన స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్ మెన్స్ ని ముప్పతిప్పలు పెట్టిన ముత్తయ్య మురళీధరణ్ జీవిత చరిత్రపై బయోపిక్ చిత్రానికి చాలా రోజుల క్రితమే రంగం సిద్ధం అయింది.

ఒకవైపు పాన్ ఇండియా చిత్రాల జోరు .. మరోవైపు బయోపిక్ చిత్రాల హోరు.. ఇది ఇది ప్రస్తుతం ఇండియన్ సినిమాలో కొనసాగుతున్న ట్రెండ్. ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్న ప్రముఖుల జీవిత చరిత్రలని ఎంచుకుని సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు. అందులోనూ క్రికెటర్ల జీవిత చరిత్రపై అత్యంత ఆసక్తి నెలకొంది. 

దీనితో సచిన్, మహేంద్ర సింగ్ ధోని, కపిల్ దేవ్ లాంటి స్టార్ క్రికెటర్స్ జీవిత చరిత్రలపై బయోపిక్ చిత్రాలు తెరకెక్కాయి. ఇదిలా ఉండగా తన స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్ మెన్స్ ని ముప్పతిప్పలు పెట్టిన ముత్తయ్య మురళీధరణ్ జీవిత చరిత్రపై బయోపిక్ చిత్రానికి చాలా రోజుల క్రితమే రంగం సిద్ధం అయింది. అయితే అయితే వివాదాల కారణంగా ఆ ప్రాజెక్ట్ తాత్కాలికంగా వాయిదా పడింది. 

దర్శకుడు ఎమ్మెస్ శ్రీపతి మురళీధరణ్ బయోపిక్ తెరకెక్కించాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. మురళీధరణ్ రోల్ కోసం విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని కూడా ఎంచుకున్నారు. ఫస్ట్ లుక్ కూడా విడుదలయింది. ఈ చిత్రానికి 800 అనే టైటిల్ పెట్టారు. విజయ్ సేతుపతి అచ్చం మురళీధరణ్ లాగా కనిపించడంతో అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. కానీ అనూహ్యంగా ఈ చిత్రం వివాదంలో పడింది. 

తమిళులు వ్యతిరేకించే మురళీధరణ్ బయోపిక్ లో విజయ్ సేతుపతి ఎలా నటిస్తాడుఅంటూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. చంపేస్తాం అంటూ నిరసన కారులు బెదిరింపులకు కూడా దిగారు. విజయసేతుపతి కుటుంబ సభ్యులని కూడా బెదిరించారు. దీనితో విజయ్ సేతుపతి చేసేది లేక ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. 

విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తప్పుకున్నా దర్శకుడు శ్రీపతి మాత్రం వదిలేలా కనిపించడం లేదు. ఈ చిత్రాన్ని 'స్లమ్ డాగ్ మిలీనియర్' ఫేమ్ దేవ్ పటేల్ తో తెరకెక్కించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవ్ పటేల్ కూడా మురళీధరణ్ రోల్ పై చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి తమిళులు ఈ ప్రాజెక్ట్ ని ముందుకు సాగనిస్తారా లేక మరోసారి వివాదం చేస్తారా అనేది వేచి చూడాలి. 

PREV
click me!

Recommended Stories

కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్
చికిరీలు గికిరీలు, ఇదేం కథ.. పెద్ది సినిమాపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి