మరో ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం.. ప్రభాస్‌-నాగ్‌అశ్విన్‌ చిత్రంలో `మహానటి` టెక్నీషియన్లు

Published : Jan 29, 2021, 11:10 AM IST
మరో ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం.. ప్రభాస్‌-నాగ్‌అశ్విన్‌ చిత్రంలో `మహానటి` టెక్నీషియన్లు

సారాంశం

ప్రభాస్‌ తన అభిమానులకు మరో అప్‌డేట్‌ ఇచ్చారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందే సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు కాస్టింగ్‌ని ప్రకటిస్తూ వచ్చిన బృందం తాజాగా, టెక్నీషియన్లని ప్రకటించడం స్టార్ట్ చేశారు. దీనికి జాతీయ అంతర్జాతీయ స్టార్స్, టెక్నీషియన్లని ఎంపిక చేస్తూ సినిమాపై హైప్‌ పెంచుకుంటూ వెళ్తున్నారు.

ప్రభాస్‌ తన అభిమానులకు మరో అప్‌డేట్‌ ఇచ్చారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందే సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు కాస్టింగ్‌ని ప్రకటిస్తూ వచ్చిన బృందం తాజాగా, టెక్నీషియన్లని ప్రకటించడం స్టార్ట్ చేశారు. దీనికి జాతీయ అంతర్జాతీయ స్టార్స్, టెక్నీషియన్లని ఎంపిక చేస్తూ సినిమాపై హైప్‌ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే ఇందులో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ని కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. దీంతోపాటు హీరోయిన్‌ బాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ దీపికా పదుకొనెని ఫైనల్‌ చేశారు. 

తాజాగా సంగీత దర్శకుడు, కెమెరామెన్‌ లను ప్రకటించారు. ఇందులో సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్‌ని ఖరారు చేశారు. ఆయన గతంలో నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన `మహానటి` చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీగా డాని శాంచెజ్‌-లోపేజ్‌ని ఖరారు చేశారు. ఆయన కూడా గతంలో `మహానటి` చిత్రానికి పనిచేశారు. టెక్నీకల్‌గా `మహానటి` టీమ్‌ని రిపీట్‌ చేస్తున్నారని చెప్పొచ్చు.  ఈ సందర్భంగా వారికి వెల్‌కమ్‌ బ్యాక్‌ అంటూ స్వాగతం పలికారు చిత్ర నిర్మాతలు. 

మరోవైపు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందిస్తూ, `మేం `మహానటి` సినిమా టైమ్‌లో ఓ ప్రపంచాన్ని సృష్టించాము. ఇప్పుడు భవిష్యత్‌లో మరో ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. వెల్‌కమ్‌ బాయ్స్ `అంటూ ట్వీట్‌ చేశారు నాగ్‌ అశ్విన్‌. ఈచిత్రాన్ని వైజయంతి ఫిల్మ్స్ పతాకంపై అశ్వినీదత్‌ దాదాపు ఐదువందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?