మహేష్‌ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా చేస్తా.. మురుగదాస్‌

Published : Aug 25, 2020, 07:31 PM IST
మహేష్‌ ఫ్యాన్స్  ఖుషీ అయ్యేలా చేస్తా.. మురుగదాస్‌

సారాంశం

మురుగదాస్‌ విషయంలో మహేష్‌ డిజప్పాయింట్‌ కావడంతో ఆయనకు మరో మంచి హిట్‌ అందించి మహేష్‌, ఆయన అభిమానులు ఖుషీ అయ్యేలా చేస్తానని తాజాగా మురుగదాస్‌ తెలిపారు. 

మహేష్‌బాబు, మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన `స్పైడర్‌` చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌గా ఈ చిత్రం రూపొందింది. జనరల్‌గా సామాజిక సందేశం, వాణిజ్య అంశాలు మేళవించి సినిమాలు రూపొందించి హిట్‌ కొట్టడం మురుగదాస్‌ స్టయిల్‌. కానీ, `స్పైడర్‌` విషయంలో అది వర్కౌట్‌ కాలేదు. తనపై మహేష్‌ పెట్టుకున్న ఆశలు, అభిమానులు పెట్టుకున్న అంచనాలను తలక్రిందులు చేసిందీ సినిమా. 

అయితే మురుగదాస్‌ విషయంలో మహేష్‌ డిజప్పాయింట్‌ కావడంతో ఆయనకు మరో మంచి హిట్‌ అందించి మహేష్‌, ఆయన అభిమానులు ఖుషీ అయ్యేలా చేస్తానని తాజాగా మురుగదాస్‌ తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం మహేష్‌ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. త్వరలోనే వెళ్ళి సూపర్‌స్టార్‌ని కలుస్తానని ఓ ఇంగ్లీష్‌ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మురుగదాస్‌ తెలిపారు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. 

ఈ ఏడాది సంక్రాంతికి రజనీకాంత్‌తో `దర్బార్‌` చిత్రాన్ని రూపొందించారు మురుగదాస్‌. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. దీంతో ఇప్పుడు మహేష్‌ తో సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడట మురుగదాస్‌. ప్రస్తుతం మహేష్‌బాబు.. పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజమౌళితో సినిమా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్