
ఎపిసోడ్ ప్రారంభంలో ఈరోజు ఇంట్లో ఇంత గొడవ జరగడానికి కారణం నువ్వే, ఇకనుంచి నందిని బాగోగులు ముకుంద చూసుకుంటుంది అంటుంది భవాని. ఎవరు చూసుకుంటే ఏంటి పెద్ద అత్తయ్య మనకి కావలసింది నందిని ఆరోగ్యం. కానీ ఇకనుంచి ఈ టాబ్లెట్లే వాడదాము అంటుంది కృష్ణ. ఈరోజు నుంచి నీకు తలనొప్పి తెచ్చే టాబ్లెట్లు వేసుకోవద్దు ఈ టాబ్లెట్లు వేసుకో అంటూ నందుకి చెప్తుంది కృష్ణ.
ఈ టాబ్లెట్లు వేసుకుంటే తలనొప్పి రాదా అంటుంది నందిని. అసలు రాదు అని కృష్ణ దంపతులు చెప్పటంతో ఆ టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళిపోతుంది నందిని. ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్ళిపోవడంతో మీరేమీ కంగారు పడకండి నేను చూసుకుంటాను అంటూ ప్రసాద్ కి, ఈశ్వర్ కి చెప్తుంది భవాని. ఈ కృష్ణ విషయం తెలియక కేసులు అవి ఇవి అంటుంది విషయం ఎంత దూరం పోతుందో ఏంటో అంటాడు ఈశ్వర్.
కాఫీ తాగుతున్న కృష్ణని అలాగే చూస్తూ ఉండిపోతుంది రేవతి. ఏంటి అత్తయ్య అలా చూస్తున్నారు కానీ కృష్ణ అంటే నీ మనసు పాలలాగా స్వచ్ఛమైనది. కోపమైనా బాధైనా అక్కడికక్కడే అంటుంది రేవతి. మన ఫ్యామిలీలో అందరూ అంతే, అయినా ఉన్నట్టుండి ఎందుకు అలా అంటున్నారు అంటుంది కృష్ణ. ఇందాక అంత పెద్ద గొడవ జరిగిన అన్ని మర్చిపోయి ఇంత ప్రశాంతంగా కాఫీ తాగుతున్నావు కదా అందుకే అంటుంది రేవతి.
మా నాన్న నాతో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి కానీ మనం మాత్రం ఆకాశం లాగా స్థిరంగా ఉండాలి అని చెప్తూ ఉండేవారు అంటుంది కృష్ణ. ఇక్కడ పరిస్థితులు మాత్రమే చెడ్డవి, మనుషులు కాదు. నందిని విషయంలో భవాని అక్క వాళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా అలాంటిదే ఉంటుంది రేవతి. ఈరోజు మీ పెద్దరికాన్ని ఎదిరించి నేను మీ అందరికి విలన్ లాగా కనిపించొచ్చు.
కానీ నందిని కొద్ది రోజుల్లోనే మతిస్థిమితం నుంచి పూర్తిగా కోలుకుంటుంది. నాకు నాకన్నా వైద్యశాస్త్రం మీద ఎక్కువ నమ్మకం అంటుంది కృష్ణ. కోడల్ని ఆనందంగా హత్తుకుంటుంది రేవతి. మరోవైపు మురారి దగ్గరికి వస్తుంది ముకుంద. ప్రేమంటే ఏంటి అంటాడు మురారి. అది నేను నిన్ను అడగవలసిన ప్రశ్న అంటుంది ముకుంద. నన్ను సమాధానం చెప్పమంటావా ప్రేమంటే స్వార్థం కాదు.
ప్రేమంటే అప నమ్మకం కాదు ప్రేమంటే గూడ చర్యం చేయటం కాదు. నువ్వు చేసేవి ఏవి కూడా ప్రేమకి సంబంధించినవి కాదు. దాన్ని ఉన్మాదం అంటారు అంటాడు మురారి. అతని మీద కోప్పడుతుంది ముకుంద. నువ్వు సరిగ్గానే విన్నావు నేను అన్నది నిజమే నువ్వు ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నావు అంటాడు మురారి. ప్రేమని వదులుకొని సన్యాసిని స్వీకరించాలా అంటుంది ముకుంద.
నేను మనిషిని కోరుకోలేదు నీ భాషలో శరీరాన్ని ఎప్పుడు కోరుకోలేదు ఇప్పుడు కూడా మనసునే కోరుకుంటున్నాను. నీ భాషలో దాన్నే కదా ప్రేమంటారు అంటుంది ముకుంద. ఎన్ని సార్లు చెప్పినా, నువ్వు బయటపడిపోయి, నన్ను నా వాళ్ళ ముందు పలచనయ్యేలాగా చేస్తున్నావు అంటాడు మురారి. నీ బాధ ఏంటి మీ ఇద్దరి ఏకాంతంలోని నేను దూరిపోతున్నాననా అంటుంది ముకుంద.
కృష్ణని అనడానికి నీకు రైట్స్ ఎవరు ఇచ్చారు అని మురారి అంటే నా ప్రేమని త్యాగం చేయడానికి నీకు రైట్స్ ఎవరు ఇచ్చారు అంటుంది ముకుంద. నీకేం రైట్స్ ఉన్నాయి నా ప్రేమని చంపుకొని నీ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోమని చెప్పటానికి అంటుంది. నువ్వు పీటల దాకా తెస్తేనే కదా ఎంత దూరం వచ్చింది. నేను వచ్చాను కాబట్టి నీకు ప్రేమ గుర్తొచ్చింది. నేనే రాకపోయి ఉంటే ఉంటే ఏం చేసేదానివి, అప్పుడు కూడా ఆదర్శ్ ని పెళ్లి చేసుకునే దానివి.
నీ ప్రేమని నువ్వు త్యాగం చేశాను అనుకుంటున్నావు కానీ ప్రేమని త్యాగం చేసింది నేను. నువ్వు పెళ్లికూతురుగా ముస్తాబతావు,పీటల మీద కూర్చుంటావు కానీ నేను కనిపించేసరికి మాత్రం నాకోసమే ప్రేమని త్యాగం చేశాను అనుకున్నావా? నేను కనబడకపోయి ఉంటే పెళ్లి చేసుకొనేదానివా కాదా అంటూ ప్రశ్నిస్తాడు మురారి.
పెళ్లి జరిగేది కాదు పీటల మీదే ఈ ముకుంద చచ్చిపోయేది ఆదర్శ్ తాళి కట్టక ముందే ఈ ముకుంద శవమయ్యేది అంటుంది ముకుంద. నేను నమ్మను అంటాడు మురారి. నన్ను తక్కువ చేసి మాట్లాడిన కోరుకుంటాను కానీ నా ప్రేమని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను అంటుంది ముకుంద. నేను ఇలాగే మాట్లాడుతాను ఏం చేస్తావ్ అంటూ కోపంగా మాట్లాడుతాడు మురారి.
ఏం చేస్తానో చూడు అంటూ డాబా మీద నుంచి దూకేస్తుంది ముకుంద. అలర్ట్ అయిన మురారి ఆమెని పట్టుకొని పైకి లాగుతాడు. ఏంటి నువ్వు చేస్తున్న పని అంటూ కేకలు వేస్తాడు. నన్ను వదులు నేను చచ్చిపోయి నా ప్రేమని నిరూపించుకుంటాను అంటుంది ముకుంద. నీ ప్రేమ గొప్పదని నమ్ముతున్నాను. నువ్వు బ్రతకాలి, రియల్లీ సారీ అంటాడు మురారి. నీకు నా ప్రేమ ఇంతేనా అర్థమైంది అంటుంది ముకుంద.
నన్ను ఎంత అవమానించావు నిజంగానే నేను చెప్తున్నాను. నువ్వు రాకపోయి ఉంటే నేను పీటల మీదే చచ్చిపోయి ఉండేదాన్ని నువ్వు వచ్చావు కాబట్టే తల ఒంచుకొని తాళి కట్టించుకోవలసి వచ్చింది. చివరికి నా బ్రతుకు కీల అయిపోయింది స్వార్థం నీది, వంచినా నీది. నీ జీవితంలో ఎవరికి స్థానం లేదని చెప్పి చివరికి పెళ్లి చేసుకొని వచ్చావు. నీ భార్యతో నువ్వు ఒంటరిగా ఉంటే నేను ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో నీకు తెలియదు.
ప్రతి దానికి నా భార్య అంటూ ఆమెని వెనకేసుకొచ్చి నన్ను చాలా తక్కువ చేస్తున్నావు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది ముకుంద. ఆవేశంలో నీ మనసుని గాయపరిచాను నన్ను క్షమించు, నా మీద ఉన్న ప్రేమను తక్కువ చేసి మాట్లాడాను. కానీ ఒక్క విషయం మన ప్రేమకి మనల్ని ఈ జీవితంలో కలిపే అవకాశం లేదు ఆ ఒక్కటి గుర్తుపెట్టుకుందాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురారి.
డిస్టబెన్స్ గా ఉన్న భర్తని చూసి సూసైడ్ కేసు చూసి వస్తున్నారా అని అడుగుతుంది కృష్ణ. ఒక్కసారిగా షాక్ అయిన మురారి నీకెందుకు అనుమానం వచ్చింది అంటాడు. నీ మొహం చూస్తే అలాగే అనిపించింది ఏం జరిగింది అంటుంది కృష్ణ. ఏమి లేదు అంటాడు మురారి. ఏదో ఉంది అంటూ మొండిగా వాదిస్తుంది కృష్ణ. ఆమెని గట్టిగా కోప్పడి మీ ఆడవాళ్లు చెప్పింది వినరా మీరు చెప్పిందే మేము వినాలా.
ఏమీ లేదు అంటే ఉంది అంటూ వాదిస్తావేంటి, నా నెత్తిన ఏదో కూర్చుని ఎవరికో ఒక మాట ఇచ్చాను, కర్మ కాలి మాట తప్పను ఇప్పుడు రోబో లాగా తయారయ్యి తీస్తే ఆడే బొమ్మని అయిపోయాను అంటాడు మురారి. చచ్చిపోయిన వాళ్ళు మీకు బాగా కావాల్సిన వాళ్లా,ఇంత ఎమోషనల్ అవుతున్నారు అంటుంది కృష్ణ. ఇది నీకు ఎమోషన్ లాగా అనిపిస్తుందా కాదు ఇరిటేషన్.
ఇకపై ఏం జరుగుతుందో తెలీదు ఏం మాట్లాడితే ఏమవుతుందో తెలీదు. ఎలా డీన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటూ ఫ్రస్టేట్ అవుతాడు మురారి. ఇప్పుడు నేను ఏమన్నానని అని కృష్ణ అంటే మీ యక్ష ప్రశ్నలకి సమాధానం చెప్పలేను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురారి. బాత్రూం నుంచి వచ్చేసరికి దుప్పటి ముసుగేసుకుని ఉన్న వ్యక్తిని నందిని అనుకొని దుప్పటి తీయబోతే నేను కృష్ణని అంటుంది కృష్ణ.
ఇదేంటి అని మురారి అంటే మీరు నన్ను తిట్టారు అందుకే నేను మీ మొహం చూడదలుచుకోలేదు అంటుంది కృష్ణ. హాస్పిటల్ కి ఇలాగే వెళ్తావా అంటాడు మురారి. నన్ను ఇరిటేట్ చేయకండి. ఇది నా ఫ్రస్టేషన్ అంటే ఇందాక మురారి అన్న డైలాగులను చెప్తుంది కృష్ణ. సారీ చెప్తాడు మురారి. 100 తిట్లు తిట్టి ఒక్క సారీ చెప్తే నా ఇగో సాటిస్ఫై అవ్వదు అంటుంది కృష్ణ. ఎవరి మీద ఉన్న కోపాన్ని నీ మీద చూపించాను అంటాడు మురారి.
నేను అడిగిన దానికి మీరు చెప్పింది దానికి సంబంధం లేదు, నేను మీ మొహాన్ని చూడదలుచుకోలేదు అంటుంది కృష్ణ. మురారి కూడా అదే దుప్పట్లో కూర్చుంటాడు మీరెందుకు మీ మొహం చూపిస్తున్నారు అంటే నువ్వు నా ఫేస్ చూడొద్దు కానీ నేను నీ ఫేస్ చూస్తాను మురారి నామీద ఎందుకు అరిచారు అని కృష్ణ అంటే నా పై ఆఫీసర్ నామీద అరిచారు, ఆ ఫ్రస్టేషన్ తో ఇంటికి వస్తే నువ్వు విసిగించావు అంటాడు మురారి.
మీరు ఫీలయ్యారా అంటే అందరి ముందు తిడితే ఫీల్ అవ్వరా అయినా ఈ విషయాన్ని మర్చిపోదాం మనం మనలాగే ఉందా అంటాడు మరి అది నేను ఎప్పుడో మర్చిపోయాను అంటుంది కృష్ణ. నీకు నామీద కోపం రాలేదా అని మురారి అంటే ఏంటో ఈసారి కోపం రాలేదు కానీ బీపీ చాలా ఎక్కువగా వచ్చినట్లు అనిపించి నవ్వొచ్చింది నవ్వితే ఇంకా మీకు మండుతుందని వూరుకున్నాను కృష్ణ.ఆ మాటలకి మురారి నవ్వుతాడు. దానికి కృష్ణ కూడా నవ్వుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.