వాళ్ళ మరణం నాకు సంతోషం పంచలేదు...బయోపిక్ కాంట్రవర్సీ పై మురళీధరన్ వివరణ

Published : Oct 17, 2020, 11:30 AM ISTUpdated : Oct 17, 2020, 11:33 AM IST
వాళ్ళ మరణం నాకు సంతోషం పంచలేదు...బయోపిక్ కాంట్రవర్సీ పై మురళీధరన్ వివరణ

సారాంశం

యుద్ధం ముగియడం ద్వారా హింసకు తెరపడిందన్న అర్థంలో నేను సంతోషం వ్యక్తం చేశాను. అంతే కానీ తమిళుల మరణాలను నేను సెలెబ్రేట్ చేసుకోలేదు అన్నారు మురళీధరన్. బయోపిక్ వలన మా తల్లిదండ్రుల గురించి అందరికీ తెలుస్తుందని ఆశపడుతున్నాను అన్నారు. అలాగే తాను చిన్న వయసులో ఉన్నప్పుడు యుద్దవాతావరణం వలన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మురళీధరన్ చెప్పుకొచ్చారు.  

శ్రీలంక లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధన్ బయోపిక్ ప్రపోజల్ వచ్చినా ఏడాది అవుతుండగా, ఆ చిత్రంలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడన్న విషయం తమిళులకు అసలు జీర్ణంకావడం లేదు. కొద్దిరోజుల క్రితం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయడంతో పాటు మురళీధరన్ గా విజయ్ సేతుపతి లుక్ విడుదల చేశారు. దానితో ఒక్కసారిగా తమిళ నెటిజెన్స్ సోషల్ మీడియా దాడికి దిగారు. 800 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న మురళీధరన్ బయోపిక్ లో నటిస్తున్న విజయ్ సేతుపతికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. 

ఆయన ఈ బయోపిక్ లో నటించడానికి వీలు లేదని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. శ్రీలంకలో ఏళ్ల తరబడి జరిగిన సివిల్ వార్ 2009లో ముగియగా ఎల్ టి టి ఈ సైన్యాన్ని, తమిళ ప్రజలను శ్రీలంక సైన్యం హతమార్చడం జరిగింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన శ్రీలంకపై ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకొనేలా ఒత్తిడి తేవాలని భారత్ ని తమిళ ప్రజలు కోరుకున్నారు. 

2009లో సివిల్ వార్ ముగిసిన సంధర్భంగా మురళీధరన్ ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. లక్షలాది తమిళుల మరణానికి కారణమైన సివిల్ వార్ ఆనందం కలిగించిందన్న మురళీధరన్ మాటలు తమిళుల కోపానికి కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

ప్రస్తుతం వివాదం నేపథ్యంలో మురళీధరన్ అప్పటి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. యుద్ధం ముగియడం ద్వారా హింసకు తెరపడిందన్న అర్థంలో నేను సంతోషం వ్యక్తం చేశాను. అంతే కానీ తమిళుల మరణాలను నేను సెలెబ్రేట్ చేసుకోలేదు అన్నారు. బయోపిక్ వలన మా తల్లిదండ్రుల గురించి అందరికీ తెలుస్తుందని ఆశపడుతున్నాను అన్నారు. అలాగే తాను చిన్న వయసులో ఉన్నప్పుడు యుద్దవాతావరణం వలన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మురళీధరన్ చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌