ప్లీజ్ స్టాప్.. రూమర్స్ వద్దు!

Published : Jan 16, 2019, 05:41 PM IST
ప్లీజ్ స్టాప్.. రూమర్స్ వద్దు!

సారాంశం

ఏ సినిమాకైనా షూటింగ్ మొదలవ్వకముందే రూమర్స్ వెలువడటం కామన్. అయితే చాలా వరకు ఆ రూమర్స్ ని ఎవరు లెక్క చేయరు. కానీ దర్శకుడు మురగదాస్ ఆదిలోనే రూమర్స్ మొక్కలను ఏరిపారేస్తున్నాడు. 

కోలీవుడ్ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తన నెక్స్ట్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా షూటింగ్ మొదలవ్వకముందే రూమర్స్ వెలువడటం కామన్. అయితే చాలా వరకు ఆ రూమర్స్ ని ఎవరు లెక్క చేయరు. కానీ దర్శకుడు మురగదాస్ ఆదిలోనే రూమర్స్ మొక్కలను ఏరిపారేస్తున్నాడు. 

ఇటీవల ఆయన నెక్స్ట్ సినిమాకు సంబందించిన టైటిల్ సెలెక్ట్ అయ్యిందని సోషల్ మీడియాలో 'నార్కలీ' అనే పేరుకు కు తెగ ప్రచారం జరిగింది. సంక్రాంతి సందర్బంగా ఇదే ఫైనల్ చేసినట్లు టాక్ వైరల్ అవుతుండడంతో మురగదాస్ క్లారిటీతో కౌంటర్ ఇచ్చేశాడు. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదని.. ప్లీజ్ స్టాప్.. దయచేసి రూమర్స్ ను స్ప్రెడ్ చేయకండి అంటూ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు. 

గత ఏడాది విజయ్ సర్కార్ సినిమాతో మురగదాస్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 250 కోట్లకు పైగా వసూలు చేసి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక నెక్స్ట్ మురగదాస్ రజినీకాంత్ తో వర్క్ చేయడానికి సిద్దమవుతున్నాడు.  

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు