15రోజులు కోమాలో ముమైత్‌ఖాన్‌,పెద్ద దెబ్బే

By Surya PrakashFirst Published Feb 21, 2021, 7:21 AM IST
Highlights

కాలు జారి గోడను కొట్టుకుని ముమైత్ తలకు పెద్ద దెబ్బే తగిలింది. ఇక ఆమె కోలుకోవడానికి మూడేళ్ళకు పైగా పడుతుందని  డాక్టర్లు స్పష్టం చేశారు. తలలో బ్లీడింగ్ అవడంతో ఇక ముమైత్ ఖాన్ బతకడం కూడా కష్టమే అనుకున్నారు బంధువులు.

ఇప్పటికీ ముమైత్ ఖాన్ అనగానే..ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ సాగే గుర్తుకు వస్తుంది. ఓ టైమ్ లో ఆ పాట యూత్ ని ఉర్రూతలూగించింది. ఆ పాట మహేష్ బాబు కన్నా ముమైత్ ఖాన్‌కు మంచి పేరు తెచ్చి పెట్టిందనటంలో అతిశయోక్తి లేదు. పోకిరి సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ లో ముమైత్ ది మేజర్ షేరే. అయితే ఆ తరువాత ఎన్ని పాటలకు నృత్యం చేసినా ముమైత్ ఖాన్‌కు పెద్దగా మైలేజ్ రాలేదు. కాకపోతే ఓ టైమ్ లో ముమైత్ ..హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే క్రేజ్ కు మాత్రం తెచ్చుకుంది. ఇలా తన కెరీర్ లో పీక్స్ కు వెళ్లిన ఆమె జీవితంలో ఓ విషాద అధ్యాయం ఉంది. 

 డిక్టేటర్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ని బాలక్రిష్ణతో చేస్తూ కాలు జారి గోడను కొట్టుకుని ముమైత్ తలకు పెద్ద దెబ్బే తగిలింది. ఇక ఆమె కోలుకోవడానికి మూడేళ్ళకు పైగా పడుతుందని  డాక్టర్లు స్పష్టం చేశారు. తలలో బ్లీడింగ్ అవడంతో ఇక ముమైత్ ఖాన్ బతకడం కూడా కష్టమే అనుకున్నారు బంధువులు.

అయితే దేవుడు దయ వల్ల తను మూడు నుంచి నాలుగు నెలల్లోనే కోలుకున్నానని ముమైత్ ఖాన్ ఆ తరువాత చెప్పారు. అడపాదడపా అప్పుడప్పుడు చిన్నచిన్న డ్యాన్స్ ఎపిసోడ్లలో ఆమె చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య ఆమె కొన్ని ఎపిసోడ్‌లలో ఏడుస్తూ కనిపించారు కూడా. ప్రస్తుతానికి బుల్లితెరలో డ్యాన్సు షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్న ముమైత్, వెండితెరపైన అవకాశాలు ఎప్పుడు వస్తాయోనని చూస్తోందట.

ఈ విషయాలన్నీ  ఆలీ యాంకర్ గా వ్యవహరించే ఫన్నీ టాక్‌ షో ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో చెప్పుకొచ్చింది. బాలకృష్ణతో కలిసి ‘డిక్టేటర్‌’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేస్తుండగా జారి పడిపోయానని ముమైత్‌ తెలిపారు. తలకు గాయమవడంతో 15రోజుల పాటు కోమాలో ఉన్నట్లు వివరించారు.

రెండు రోజుల పాటు తల నుంచి రక్తం కారుతూనే ఉందని ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుని బాధపడ్డారు. మూడు సంవత్సరాలు డాక్టర్‌ విశ్రాంతి తీసుకోమంటే కేవలం మూడు నెలల తర్వాత మళ్లీ షూటింగ్‌కు వెళ్లినట్లు చెప్పారు. ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలను చూడాలంటే ఫిబ్రవరి 22వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే. 
 

click me!