రాంచరణ్ తో సీత రొమాన్స్.. బుచ్చిబాబు భలే సెట్ చేస్తున్నాడే ?

Published : Feb 20, 2023, 12:44 PM IST
రాంచరణ్ తో సీత రొమాన్స్.. బుచ్చిబాబు భలే సెట్ చేస్తున్నాడే ?

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్ రానున్న రోజుల్లో ఫుల్ బిజీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ వరుస బ్రేక్ లతో సాగుతోంది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ రానున్న రోజుల్లో ఫుల్ బిజీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ వరుస బ్రేక్ లతో సాగుతోంది. శంకర్ ఇండియన్ 2 కూడా షూట్ చేస్తుండడంతో ఆర్సీ 15 ఆలస్యం అవుతోంది. 

అయితే రాంచరణ్ తదుపరి చిత్రాలు కూడా ఆల్మోస్ట్ ఖరారయ్యాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో చరణ్ మూవీ అఫీషియల్ గా ప్రకటించబడింది. సుకుమార్ తో మరో చిత్రం చేయాల్సి ఉంది. అలాగే కన్నడ దర్శకుడు నర్తన్ తో చర్చలు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. 

శంకర్ మూవీ పూర్తి కాగానే బుచ్చిబాబు చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ సైలెంట్ గా జరిగిపోతున్నట్లు టాక్. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ ని కూడా దర్శకుడు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సీతారామం చిత్రంతో మాయ చేసిన మృణాల్ ఠాకూర్ ని రాంచరణ్ కి జోడిగా బుచ్చిబాబు ఎంపిక చేశారు. 

సీతా రామం చిత్రంలో మృణాల్ నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. తాను అనుకున్న కథకి మృణాల్ న్యాయం చేస్తుంది అని బుచ్చిబాబు ఆమెని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ రూమర్ లో ఎంత వరకు నిజం ఉందొ తెలియదు. ఈ క్రేజీ రూమర్ నిజం కావాలని మెగా ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. రాంచరణ్ , మృణాల్ ఠాకూర్ జోడి అదిరిపోతుందని అంటున్నారు.  

PREV
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే