పిల్లలకు అలా పేర్లు పెట్టి... తాతపై అభిమానాన్ని చాటుకున్న తారకరత్న.!

Published : Feb 20, 2023, 12:13 PM IST
పిల్లలకు అలా పేర్లు పెట్టి... తాతపై అభిమానాన్ని చాటుకున్న తారకరత్న.!

సారాంశం

నందమూరి ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతటి ప్రేమ, అభిమానం ఉంటుందో ప్రత్యేక చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో తారకరత్న కూడా తాతపై తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు.   

నందమూరి తారకరత్న (Tarakaratna) అకాల మరణంతో  చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయస్సులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అయితే, నందమూరి వంశంలో  సీనియర్ ఎన్టీఆర్, నందమూరి తారక రామరావు (Senior NTR) అంటే వారి కుటుంబ సభ్యుల్లో ఎంతటి ప్రేమ అభిమానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈక్రమంలో తారకరత్న కూడా తన అభిమానాన్ని చాటుకున్నారు. ఎలాగంటే...

తారకరత్న - అలేఖ్య  రెడ్డి వివాహం తర్వాత ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ముందుగా కూతురు నిష్క పుట్టింది.  ఆ తర్వాత కవలలుగా కొడుకు తనయ్ రామ్, కూతురు రేయా పుట్టారు.  అయితే తాత తారకరామారావుపై ఉన్న ప్రేమ, అభిమానంతో తన పిల్లలకు ఆయన పేరు వచ్చేలా నామకరణం చేశారంట. NTRలోని ఒక్కో ఇంగ్లీష్ లెటర్ కలిసేలా వారికి నేమ్స్ ఎంపిక చేశారు.  N-Nishka, T-Tanayram, R-Reyaగా పేర్లు పెట్టారని సన్నిహితులు నుంచి సమాచారం. తారకరత్న ఇలా తాతపై అభిమానం చాటుకోవడం విశేషంగా మారింది. అయితే తారకరత్న మరణంతో పిల్లల బాధ్యతలను బాలయ్య తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఇక గతనెల 27న  కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో లోకేష్  ‘యువగళం’ పాద్రయాత్రను ప్రారంభించారు.  యాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన  వైద్యం కోసం బెంగళూరులోని ప్రముఖ హ్రుదయాల ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకుడా పోయింది. 22 రోజుల పాటు పోరాడి శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. మహాప్రస్థానంలో అంత్యక్రియులు జరగనున్నాయి. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?