
క్రేజీ హీరో అడివి శేష్, యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం డెకాయిట్. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షానిల్ డియో దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా డెకాయిట్ షూటింగ్ లో ఊహించని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తూ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ కింద పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరికీ దెబ్బలు గట్టిగానే తగిలినట్లు తెలుస్తోంది. అయితే ఆందోళన చెందాల్సిన గాయాలు కాదు. అడివి శేష్, మృణాల్ ఇద్దరూ గాయాలతోనే షూటింగ్ పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఆ విధంగా వీరిద్దరూ వృత్తి పట్ల డెడికేషన్ ప్రదర్శించారు.
ప్రస్తుతం డెకాయిట్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగ్ చివరి సమాచారం. డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మృణాల్, అడివి శేష్ లకు తగిలిన గాయాలు పెద్దవి కాకూడదు అని చిత్ర యూనిట్ కోరుకుంటున్నారు. స్వల్ప గాయాలతోనే వారిద్దరూ బయట పడడం ఊరటనిచ్చే అంశం.
అడివి శేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గూఢచారి, ఎవరు, హిట్ 2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అడివి శేష్ కి ఉన్నాయి. గూఢచారి 2, డెకాయిట్ చిత్రాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. అడివి శేష్ కి పవన్ కళ్యాణ్ పంజా చిత్రంతో గుర్తింపు దక్కింది. బాహుబలిలో భల్లాల దేవుడు కొడుకుగా కూడా నటించాడు. ఇక మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రంతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె త్వరలో అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.