తనకు కరోనా ఎలా సోకిందో తెలిపిన నవనీత్‌ కౌర్‌

Published : Aug 08, 2020, 10:57 AM IST
తనకు కరోనా ఎలా సోకిందో తెలిపిన నవనీత్‌ కౌర్‌

సారాంశం

మొదట నా కుమార్తె, కుమారుడితోపాటు ఇతర కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకిందని నవనీత్‌ కౌర్‌ తెలిపింది. ఓ తల్లిగా వారిని జాగ్రత్తగా చూసుకోవడం నా మొదటి కర్తవ్యం. ఈ క్రమంలో నాకూ వైరస్‌ సోకిందని, పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన నేను అధైర్య పడలేదని, ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటున్నానని పేర్కొంది.  

మాజీ నటి, ఎంపీ నవనీత్‌ కౌర్‌ ఇటీవల కరోనాకి గురైన విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. అయితే తనకు వైరస్‌ ఎలా సోకిందో వివరించింది
నవనీత్‌ కౌర్‌. ఫేస్‌బుక్‌లో ఆ వివరాలను పంచుకుని అభిమానులు కుదుట పడేలా చేసింది. వారికి ధైర్యాన్నిచ్చింది. 

ఆమె చెబుతూ, నా కుమార్తె, కుమారుడితోపాటు ఇతర కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకింది. ఓ తల్లిగా వారిని జాగ్రత్తగా చూసుకోవడం నా మొదటి కర్తవ్యం. ఈ క్రమంలో నాకూ
వైరస్‌ సోకింది. పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన నేను అధైర్య పడలేదు. ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటున్నా. నేనే కాదు మా ఫ్యామిలీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
అభిమానులెవరూ అధైర్య పడవద్దని తెలిపింది. 

అభిమానుల ఆశీస్సులతో కరోనాని త్వరగానే జయిస్తామని తెలిపింది. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ ప్రభుత్వం సూచించే నిబంధనలు, మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి
చేశారు. ప్రస్తుతం నవనీత్ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు నటిగా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి
ఆకట్టుకున్న విషయం తెలిసిందే. `శీను వాసంతి లక్ష్మీ`, `జగపతి`, `రూమ్మేట్స్`, `మహారధి`, `యమదొంగ`, `టెర్రర్‌`, `నిర్ణయం`, `కాలచక్రం` వంటి చిత్రాల్లో నటించి తెలుగు
ఆడియెన్స్ ని మెప్పించింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద