ధోనీ రిటైర్‌మెంట్‌పై సినీ తారల భావోద్వేగ ట్వీట్‌లు

Published : Aug 16, 2020, 11:59 AM IST
ధోనీ రిటైర్‌మెంట్‌పై సినీ తారల భావోద్వేగ ట్వీట్‌లు

సారాంశం

మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్‌మెంట్‌ ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అంతేకాదు సెలబ్రిటీలు సైతం ధోనీ రిటైర్‌మెంట్‌పై ఎమోషనల్‌ అవుతున్నారు. తాజాగా టాలీవుడ్‌ హీరోలు ధోనీ సేవలను, ఘనతలను కొనియాడారు. 

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్‌మెంట్‌ ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అంతేకాదు సెలబ్రిటీలు సైతం ధోనీ రిటైర్‌మెంట్‌పై ఎమోషనల్‌ అవుతున్నారు. తాజాగా టాలీవుడ్‌ హీరోలు ధోనీ సేవలను, ఘనతలను కొనియాడారు. 

ట్విట్టర్‌ ద్వారా మహేష్‌బాబు స్పందిస్తూ, 2011లో ఇండియాను క్రికెట్‌ విశ్వవిజేతగా నిలిపిన ఆ ఐకానిక్‌ సిక్సర్‌ను నేను ఎలా మర్చిపోగలను. నేను ఆ సమయంలో వాంఖేడియం స్టేడియంలోనే నిలుచున్నాను. గర్వంగా ఉంది. కన్నీళ్ళు వస్తున్నాయి. క్రికెట్‌ ఎప్పడూ ఒకేలా ఉండదు. టేక్‌ ఏ బౌ ఎం.ఎస్‌.ధోనీ` అని తెలిపారు. 

మరోవైపు సీనియర్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ సైతం ధోన ఘనతను గుర్తు చేసుకున్నారు. `ఎన్నో మెమరీస్‌ని అందించినందుకు ధన్యవాదాలు. మేం మిమ్మల్ని ఫీల్డ్ లో చాలా మిస్‌ అవుతాం` అని ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. 

యంగ్‌ హీరో అఖిల్‌ సైతం ధోనిని గుర్తు చేసుకున్నారు. `మీరందించిన అద్బుతమైన జ్ఞాపకాలకు ధన్యవాదాలు కెప్టెన్‌. మీ జర్నీ ప్రభావితం చేయడమే కాదు, భారత క్రికెట్‌ని ఉత్తమంగా మార్చింది. వాట్‌ ఏ లెజెండ్‌` అని అఖిల్‌ ట్వీట్‌ ద్వారా ఎమోషనల్‌ అయ్యాడు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ సైతం ధోనిని గుర్తు చేసుకుంటూ ఆయనకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా