'మా' లొల్లి.. స్టార్ హీరోలు పట్టించుకోరా?

By Prashanth MFirst Published Mar 8, 2019, 4:12 PM IST
Highlights

తెలుగు చిత్ర పరిశ్రమ  మరోసారి వివాదాలకు సెంటర్ ఎట్రాక్షన్ గా మారింది. ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో రెండు భాగాలుగా చీలిపోయి పొలిటికల్ యుద్ధం తరహాలో యాక్టర్స్ మీడియాకెక్కుతున్నారు. మార్చ్ 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక పోటీలో ఉన్న నరేష్ - శివాజీరాజా వర్గాలు ఒకరినోకు విమర్శలు చేసుకుంటూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. 

జూనియర్ ఆర్టిస్ట్ లు మరికొంత మంది సీనియర్ దర్శకులు మాత్రమే 'మా' లో కనిపిస్తున్నారు. కానీ బడా హీరోలు ఒక్కరు కూడా ఎలక్షన్స్ విషయం గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సినిమా వేడుకల్లో ఇండస్ట్రీ కోసం ఏమైనా చేస్తాం అనే స్టార్ హీరోలు ఇండస్ట్రీలో గొడవలు ఓ రేంజ్ లో అవుతుంటే కనీసం పట్టించుకోకకపోవడం గమనార్హం. 

గతంలో మెగాస్టార్ చిరంజీవి నాగార్జున అలాగే వెంకటేష్ వంటి హీరోలు ప్యానెల్ ఉన్నారు. బడా నిర్మాతలు కూడా కమిటీలో ఉన్నారు కానీ మీటింగ్ లు జరిగితే ఒక్కరు కూడా హాజరవ్వరు అని ఆర్టిస్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడా హీరోలు మహేష్ ప్రభాస్ అలాగే అక్కినేని మెగాస్టార్ నందమూరి దగ్గుబాటి వంటి ఫ్యామిలీల నుంచి రెండవతరం వారు 'మా' కమిటీలోకి అడుగుగుపెడితే బావుంటుందని అంటున్నారు. 

మెయిన్ గా స్టార్ హీరోలు ఎవరైనా ఒకరు కమిటీ బాధ్యతలు తీసుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జూనియర్ ఆర్టిస్ట్ ల జీవితాలు బాగుపడతాయని ఫిల్మ్ నగర్ జనాలు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మా కమిటీలో అర్హత పొందినవారు 800మందికి  పైగా ఉన్నట్లు తెలుస్తోంది. 

కానీ హీరోలు బిజీ షెడ్యూల్ అంటూ ఇతర కారణాలతో చాలా వరకు తప్పించుకుంటున్నారని ఇండస్ట్రీలో ఎన్ని గొడవలు జరిగినా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక శివాజీ రాజా - నరేష్ ల మధ్య జరిగే పోటీలో ఒకటి రెండు ఓట్ల మధ్యలో ఎవరో ఒకరు గెలిచే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. 

click me!