చిరంజీవి సినిమా షూటింగ్ లో సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి!

Published : Mar 30, 2019, 10:42 AM IST
చిరంజీవి సినిమా షూటింగ్ లో సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి!

సారాంశం

నటుడు చిరంజీవి సర్జా నటిస్తోన్న 'రణం' సినిమా షూటింగ్ లో సిలిండర్ పేలడంతో ఇద్దరు తల్లీకూతుళ్లు మరణించారు. 

నటుడు చిరంజీవి సర్జా నటిస్తోన్న 'రణం' సినిమా షూటింగ్ లో సిలిండర్ పేలడంతో ఇద్దరు తల్లీకూతుళ్లు మరణించారు. మృతులను చిన్నారి అయిషా ఖాన్(5), తల్లి సుయేరా భానుగా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. బెంగుళూరు నగరంలోని బాగాలూరు వద్ద 'రణం' సినిమా షూటింగ్ జరుగుతోంది. సుయేరా భాను తన ఐదేళ్ల చిన్నారితో కలిసి షూటింగ్  చూడడానికి వెళ్లింది. ఆ సమయంలో కారును బ్లాస్ట్ చేసే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ క్రమంలో సడెన్ గా సిలిండర్ పేలింది. దీంతో అక్కడే ఉన్న తల్లీకూతుళ్లు మరణించగా, మరో చిన్నారి తీవ్రగాయాలపాలైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన తరువాత షూటింగ్ ఆపేసి చిత్రబృందం అక్కడ నుండి పారిపోయింది.

ఈ సినిమాలో హీరోగా నటిస్తోన్న చిరంజీవి మరో సినిమా షూటింగ్ కోసం మైసూరుకి వెళ్లారు. మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న చేతన్ కుమార్ విషయం తెలుసుకొని తన ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు తన సహాయం ఉంటుందని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?