
భారత్ లో ఓటీటీ మార్కెట్ అతి తక్కువ కాలంలోనే విస్తరించింది. ఈ క్రమంలో కొందరు రీజనల్ మార్కెట్ పై దృష్టి పెడితే,మరికొందరు అంతర్జాతీయ కంటెంట్ ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇందులోని కొన్ని ఛానెళ్లు మాత్రమే దూసుకుపోతున్నాయి. అమెజాన్, డిస్నీహాట్ స్టార్ లాంటి ఛానళ్లు టాప్ ప్లేసులో ఉన్నాయి. అయితే ప్రముఖ ఛానెల్ ‘నెట్ ఫ్లిక్స్’ ఇండియాలో తన పట్టుబిగించేందుకు నానా కష్టాలు పడుతోంది. లోకల్ కంటెంట్ తక్కవ ఉండటంతో జనం ఆదరించలేకపోతున్నారు. వరల్డ్ వైడ్ గా నెట్ ఫ్లిక్ష్ సబ్ స్క్రైబర్లు కోట్ల మంది ఉన్నారు. కానీ భారత్ కు వచ్చే సరికి ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. ఈ క్రమంలో 2024లో ప్రపంచ వ్యాప్తంగా మన ఇండియన్ సినిమాలు నెట్ ప్లిక్స్ ఏవి ఎక్కువమంది చూసారో లిస్ట్ బయిటకు వచ్చింది. అది చూద్దాం.
👉#Animal - 13.6M
👉#Dunki - 10.8M
👉#Bhakshak - 10.4M
👉#GunturKaaram - 4.9M
👉#HiNanna - 4.2M
👉#Salaar - 3.5M
👉#Annapoorni - 3.1M
👉#CurryAndCyanide - 2.1M
👉#KhoGayeHumKahan - 1.8M
ప్రస్తుతం వరల్డ్ టాప్ ఓటీటీగా నెట్‌ఫ్లిక్స్ కొనసాగుతోంది.గతంలో 2023లో నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్స్ దాదాపు 240 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నట్టు ప్రకటించింది. తాజాగా 2023 చివరివరకు నెట్‌ఫ్లిక్స్ కి ప్రపంచవ్యాప్తంగా 260 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నట్టు ప్రకటించింది. అంటే దాదాపు 26 కోట్లకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు నెట్‌ఫ్లిక్స్ కి. గత మూడు నెలల్లోనే 13 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ పెరిగారని తెలిపింది. అలాగే నెట్‌ఫ్లిక్స్ ఫుల్ ప్రాఫిట్స్ లో కూడా నడుస్తుందని సమాచారం. లోకల్ భాషల్లో కూడా ఒరిజినల్ కంటెంట్ ని అందిస్తూ ప్రేక్షకులని తమ వైపుకు తిప్పుకుంటుంది. అంతేకాక ఇక్కడి స్టార్ హీరోల సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్ కొనేస్తూ అభిమానులని తమ అడ్డకు రప్పించుకుంటుంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సారండోస్ ఇండియాకు వచ్చి బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ ని కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే.
నెట్ ప్లిక్స్ లో ... మార్చి నెల రిలీజులు:
మార్చి 1:
మామ్లా లీగల్ హై(వెబ్ సిరీస్)
స్పేస్ మ్యాన్
హోల్మ్స్ అండ్ వాట్సన్
స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్
బార్డ్స్ ఆఫ్ ప్రే
మార్చి 7:
ది జెంటిల్ మెన్
మార్చి 8: డాంసెల్, ది బ్యాకప్ ప్లాన్
మార్చి 10: బ్లాక్ ఆడమ్
మార్చి 11: యంగ్ రాయల్స్(వెబ్ సిరీస్)
మార్చి 13:
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్
మార్చి 15: మర్డర్ ముబారక్