#Saipallavi:భారీ రేటుకు నెట్ ప్లిక్స్ కు సాయి పల్లవి ఫిల్మ్,వివాదమే కలిసొచ్చిందా?

Published : Mar 07, 2024, 10:43 AM IST
#Saipallavi:భారీ రేటుకు నెట్ ప్లిక్స్ కు సాయి పల్లవి ఫిల్మ్,వివాదమే కలిసొచ్చిందా?

సారాంశం

  రెబెకా వ‌ర్గీస్ పాత్ర‌ను సాయిప‌ల్ల‌వి చేస్తోంది. సాయిప‌ల్ల‌వి ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు.  


తమిళ  స్టార్ హీరో శివకార్తికేయన్ కు గత కొంతకాలంగా హిట్ పడలేదు. ప్రిన్స్, ఆయలాన్ సినిమాలు రెండు పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలో  సాయి పల్లవి కాంబినేషన్ లో ఓ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా పేరు  అమరన్.. వీరమరణం చెందిన సైనికుడు ముకుందన్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  అమ‌ర‌న్ సినిమాలో ముకుంద్ పాత్ర‌లో శివ‌కార్తికేయ‌న్ క‌నిపించ‌నుండ‌గా...అత‌డి భార్య రెబెకా వ‌ర్గీస్ పాత్ర‌ను సాయిప‌ల్ల‌వి చేస్తోంది. సాయిప‌ల్ల‌వి ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. అటు ఈ మూవీని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ సంస్థ నిర్మిస్తోంది ఈ సినిమాను నిర్మిస్తూనే ఇందులో ఓ గెస్ట్ రోల్ క‌మ‌ల్‌హాస‌న్ క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.. ఆ మధ్యన  ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది.. సినిమాను నిలిపివేయాలంటూ ఆందోళనలు జరిగాయి. దాంతో ఒక్కసారిగా ఈ సినిమాకు అటెన్షన్ వచ్చేసింది. అదే సమయంలో ఈ సినిమా బిజినెస్ కూడా ఊపందుకుంది. 

అందుతున్న సమాచారం మేరకు ..అమ‌ర‌న్ మూవీ షూటింగ్ కూడా పూర్తికాక‌ముందే ఓటీటీ హ‌క్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. రికార్డు ధ‌ర‌కు ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. 55 కోట్ల‌కు కొనుగులు చేసిందని తమిళ వర్గాల నుంచి తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ పోటీప‌డ్డ‌ట్లు తెలిసింది. నెట్‌ఫ్లిక్స్ భారీ రేట్‌కు హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న‌ద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. శివ‌కార్తికేయ‌న్‌తో పాటుసాయిప‌ల్ల‌వి కెరీర్‌లో అత్య‌ధిక ధ‌ర‌కు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా అమ‌ర‌న్ నిలిచింది. త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డం, మ‌ల‌యాళం, హిందీ హ‌క్కులు మొత్తం నెట్‌ఫ్లిక్స్ కే ఇచ్చేసిన‌ట్లు తెలిసింది.

అలాగే  ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కొద్ది రోజుల క్రితం విడుదల చేశారు మేకర్స్‌. అయితే, టీజర్ విడుదల్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది అమరన్ మూవీ టీజర్‌లో .. కొన్ని వివాదాస్పదమైన సన్నివేశాలు ఉన్నాయని, ఈ సినిమాను నిలిపివేయాలని తమిళనాడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేసారు. విడుదల చేసిన అమరన్ మూవీ టీజర్‌లో కాశ్మిరీలు, ముస్లింలను ఉగ్రవాదులుగా మార్చే.. కొన్ని సన్నివేశాలను చూపించారు. అంతే కాకుండా కలిసి మెలసి జీవించే హిందువులు, ముస్లింల మధ్య విభేదాలను సృష్టించేలా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

 ఇక భార‌త ఆర్మీకి విశేష సేవలందించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ గురించి రాహుల్ సింగ్, శివ్ అరూర్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ అనే పుస్త‌కం అధారంగా ‘అమరన్‌’ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఆయన జీవితంపై చాలాకాలం రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసారు. రాష్ట్రీయ రైఫిల్స్‌ 44వ బెటాలియన్‌కు చెందిన మేజర్ వరదరాజన్.. ఏప్రిల్ 2014 లో జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని ఒక గ్రామంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు.

ఆయనకు మరణానంతరం దేశ అత్యున్నత శాంతి శౌర్య పురస్కారం అశోక చక్ర లభించింది. ఇప్పుడు అలాంటి స్ఫూర్తిదాయమైన పాత్రలో శివకార్తికేయన్ కనిపించనున్నారు. సాయి పల్లవితో పాటుగా భువన్ అరోరా, రాహుల్ బోస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, సోనీ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 సమ్మర్ లో తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు
Annagaru Vostaru:అన్నగారు వస్తారా ? రారా ? బాలకృష్ణ తర్వాత కార్తీ సినిమాకు చుక్కలు చూపిస్తున్న హైకోర్టు