Salaar Trailer: సలార్ ట్రైలర్ రన్ టైం ఎన్ని నిమిషాలో తెలుసా?

By Sambi ReddyFirst Published Dec 1, 2023, 1:39 PM IST
Highlights


ఇవాళ సినిమా ప్రియులకు పండగే పండగ. ఒక ప్రక్క థియేటర్స్ లో యానిమల్ జాతర షురూ అయ్యింది. మరికొన్ని గంటల్లో సలార్ ట్రైలర్ సునామీతో సోషల్ మీడియా కొట్టుకుపోనుంది. 
 

సలార్ మూవీ ట్రైలర్ కి కౌంట్ డౌన్ మొదలైంది. నేడు సాయంత్రం 7:19 నిమిషాలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ ట్రైలర్ పై ఈ రేంజ్ లో అంచనాలు ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కె జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేస్తున్న మూవీ కావడంతో జనాల్లో విపరీతమైన హైప్ ఏర్పడింది.  

సలార్ ట్రైలర్ అద్భుతంగా వచ్చిందట. ట్రైలర్ కట్ అదిరిందని టాక్, మరో కీలక విషయం ట్రైలర్ గురించి తెలుస్తుంది. సలార్ ట్రైలర్ సుదీర్ఘంగా 3 నిమిషాల 45 సెకండ్స్ అట. ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఇది అనడంలో సందేహం లేదు. సాధారణంగా ట్రైలర్ రెండున్నర నిమిషాల నుండి మూడు నిమిషాల లోపు ఉంటుంది. సలార్ ట్రైలర్ మూడు నిమిషాలకు పైగా సాగనుంది. 

Latest Videos

సలార్ టీజర్ లో ప్రభాస్ ని పెద్దగా ప్రాజెక్ట్ చేయలేదు. నటుడు టిన్ను ఆనంద్ తో ప్రభాస్ క్యారెక్టర్ ఎలివేట్ చేశారు. ఇక ట్రైలర్ లో ఎలా ప్రజెంట్ చేయనున్నారనే చర్చ మొదలైంది. సలార్ డిసెంబర్ 22న విడుదల కానుంది. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు. 

ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ మూవీ స్టోరీ లీక్ చేశాడు. ఇది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య జరిగే కథ. ఒకప్పటి మిత్రులు శత్రువులుగా మారి యుద్ధం సాగిస్తారని ప్రశాంత్ నీల్ చెప్పాడు. సలార్ కెజిఎఫ్ మూవీలో భాగం కూడా కావొచ్చనే వాదన ఉంది. దీనికి సమాధానం సినిమా చూసి తెలుసుకోవాలని ప్రశాంత్ నీల్ అన్నారు. 

ఓటు వేయని ప్రభాస్.. ఎందుకు? మరి వీళ్లు కూడా కనిపించలేదేంటీ?
 

click me!