అఖిల్‌కి సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్ ః సోహైల్‌తో ఉన్న కమిట్‌మెంట్‌ని పూర్తి చేసిన మోనాల్‌..

Published : Jan 19, 2021, 05:51 PM IST
అఖిల్‌కి సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్ ః సోహైల్‌తో ఉన్న కమిట్‌మెంట్‌ని పూర్తి చేసిన మోనాల్‌..

సారాంశం

అఖిల్‌, సోహైల్‌ మంచి స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు `బిగ్‌బాస్‌4` టైటిల్‌ విన్ అయినా  మరొకరికి బైక్‌, ల్యాప్‌ ట్యాప్‌ కోనివ్వాలని డీల్‌ కుదుర్చుకున్నారు. కానీ వీరిద్దరిలో ఎవరూ టైటిల్‌ విన్‌ కాలేదు. సోహైల్‌ తనకు వచ్చిన 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని జాక్‌పాట్‌ కొట్టేశాడు. కానీ అఖిల్‌ బకరా అయ్యారు. అయితే సోహైల్‌తో, అఖిల్‌కి బైక్‌, ల్యాప్‌ట్యాప్‌ డీల్‌ అలానే ఉండిపోయింది. 

అఖిల్‌, మోనాల్‌ బిగ్‌బాస్‌ 4 హౌజ్‌లో ప్రేమ పావురాలుగా వెలిగారు. వీరిద్దరు తెగ పులిహోర కలుపుకున్నారు. అఖిల్‌, సోహైల్‌ మంచి స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు `బిగ్‌బాస్‌4` టైటిల్‌ విన్ అయినా  మరొకరికి బైక్‌, ల్యాప్‌ ట్యాప్‌ కోనివ్వాలని డీల్‌ కుదుర్చుకున్నారు. కానీ వీరిద్దరిలో ఎవరూ టైటిల్‌ విన్‌ కాలేదు. సోహైల్‌ తనకు వచ్చిన 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని జాక్‌పాట్‌ కొట్టేశాడు. కానీ అఖిల్‌ బకరా అయ్యారు. అయితే సోహైల్‌తో, అఖిల్‌కి బైక్‌, ల్యాప్‌ట్యాప్‌ డీల్‌ అలానే ఉండిపోయింది. 

ఈ డీల్‌ని ఫుల్‌ఫిల్‌ చేసింది అఖిల్‌ ప్రియురాలు మోనాల్‌. అఖిల్‌కి ల్యాప్‌ట్యాప్‌ ని గిఫ్ట్ గా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. దీంతో ఆయన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఇటీవల అఖిల్‌కి పూల డిజైన్‌తో కూడిన ఎర్ర చొక్కాని గిఫ్ట్ గా ఇచ్చింది మోనాల్‌. దీంతో మోనాల్‌కి థ్యాంక్స్ చెప్పాడు అఖిల్‌. `నాకు తెలుసు, ఈ చొక్కాలో నేను చాలా హాట్‌గా కనిపిస్తున్నా కదూ` అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఫోటో పెట్టాడు. దీంతో వీరిద్దరు హౌజ్‌ నుంచి బయటికి వచ్చాక కూడా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరు కలుసుకుంటూ హంగామా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మోనాల్‌ ఓ వైపు `స్టార్‌మా`లో `డాన్స్ ప్లస్‌` షోలో జడ్జ్ గా వ్యవహరిస్తుంది. మరోవైపు ఇటీవల `అల్లుడు అదుర్స్` సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేసిన విషయం తెలిసిందే. కానీ అఖిల్‌కి ఇంకా ఎలాంటి సినిమా ఆఫర్స్ రావడం లేదు. ఆయన ఇటీవల యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించినట్టు తెలుస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి