AR Rahman ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన స్టార్‌ హీరోయిన్‌.. అంతా ప్లాన్‌ చేసుకున్నాక హార్ట్ బ్రేక్‌ అయ్యే ట్విస్ట్

Published : Feb 26, 2026, 01:24 PM IST
Actress Mohini, AR Rahman

సారాంశం

AR Rahman: ఒకప్పుడు తాను ఏఆర్ రెహమాన్‌ను పిచ్చిగా ఆరాధించానని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నానని నటి మోహిని తాజాగా వెల్లడించారు.  కానీ ఆయన పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్టు తెలిపారు. 

`ఆదిత్య 369`, `హిట్లర్‌`తో మోహిని పాపులర్‌

90వ దశకంలో సౌత్ ఇండియాలో ఫేమస్ హీరోయిన్‌గా ఉన్న నటి మోహిని గుర్తున్నారా? తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె `ఆదిత్య 369`, `డిటెక్టివ్‌ నారద`, `హిట్లర్‌` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే తెలుగులో లిమిటెడ్‌గానే చేసిన ఆమె తమిళం, మలయాళంలో మాత్రం అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. 

రెహ్మాన్‌ మతం మారడం షాక్‌కి గురి చేసింది-మోహిని

ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్న మోహిని  తాజాగా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో,  ఏఆర్ రెహమాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు తాను రెహమాన్‌ను ఎంతగానో ఇష్టపడ్డానని, ఆయన మతం మారడం తనను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. రెహమాన్‌ను ఒక్కసారే కలిసినా, ఆయన్నే పెళ్లి చేసుకోవాలని బలంగా అనుకున్నట్లు తెలిపారు.

రెహ్మాన్‌ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్‌ చేసిన మోహిని

`నేను ఏఆర్ రెహమాన్‌కు పెద్ద అభిమానిని. పిచ్చి అభిమానం అనే చెప్పాలి. ఆయన ఇస్లాం మతంలోకి మారారని తెలిసినప్పుడు నా గుండె పగిలిపోయింది. అప్పుడు నేను హిందువుని. ఆయన తన అసలు పేరు దిలీప్‌తోనే ఉంటే బాగుండేది, మతం మారాల్సిన అవసరం లేదు. అలాగైతే, మా ఇంట్లో చెప్పి, ఎలాంటి గొడవలు లేకుండా పెళ్లి చేసుకోవచ్చని మనసులో ప్లాన్ కూడా వేసుకున్నా. కానీ, ఆయన నాకంటే వయసులో చాలా చిన్నవాడని కూడా నాకు తెలుసు` అని మోహిని అన్నారు.

`ఒక్కసారే కలిశాను`

`రెహ్మాన్‌ని నేను ఒక్కసారే నేరుగా కలిశాను. మలేషియాలో జరిగిన ఆయన మొట్టమొదటి మ్యూజిక్ షోకు నేను హోస్ట్‌గా వెళ్లాను. అది దాదాపు 40,000 మందితో జరిగిన పెద్ద షో. ప్రోగ్రామ్ అయిపోయాక ఫ్లైట్‌లో తిరిగొస్తున్నప్పుడు, మాతో పాటు ఓ 25 మంది ఆర్టిస్టులు ఉన్నారు. నేను నా బ్యాగ్ పెట్టుకుని కూర్చోబోతుంటే, రెహమాన్ సర్ అటుగా వచ్చారు. ఎవరితోనూ మాట్లాడకుండా, నేరుగా నా దగ్గరికొచ్చి 'హలో' చెప్పారు. ఆ మాట వినగానే ఆర్టిస్టులందరూ నావైపే చూశారు. ఆయన హలో చెప్పి వెళ్లిపోయారు` అని మోహిని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

జోరందుకున్న ఉస్తాద్ అడ్వాన్స్ బుకింగ్స్, గంటల వ్యవధిలోనే ఏం మ్యాజిక్ జరిగిందో తెలుసా ?
Peddi : పెద్ది సెట్స్‌లో తిలక్ రచ్చ.. చరణ్ అదిరిపోయే గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో