Kannappa: అప్పుడు ప్రభాస్‌, ఇప్పుడు మోహన్‌లాల్‌.. `కన్నప్ప` రేంజ్‌ పెంచుతున్న మంచు విష్ణు

ఇప్పటికే ఇందులో ప్రభాస్‌ (Prabhas) నటించబోతున్నట్టు ప్రకటించారు మంచు విష్ణు. ఓ  శక్తివంతమైన పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ చిత్రంలోకి మరో స్టార్‌ హీరో చేరారు.

mohanlal enter into manchu vishnu kannappa project after prabhas arj

వరుస పరాజయాల్లో ఉన్న మంచు విష్ణు(Manchu Vishnu) ఈ సారి భారీ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ఆయన `కన్నప్ప`(Kannappa) పేరుతో సినిమాని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మంచు విష్ణుతోపాటు భారీ కాస్టింగ్‌ నటించబోతుంది. సినిమా ప్రారంభించినప్పుడు మామూలు సినిమాగానే అనిపించింది. కానీ ఇందులోకి యాడ్‌ అవుతున్న కాస్టింగ్ చూస్తుంటే ఇది పాన్‌ ఇండియా రేంజ్‌ మూవీగా తెరకెక్కిస్తున్నారని అర్థమవుతుంది. 

ఇప్పటికే ఇందులో ప్రభాస్‌ (Prabhas) నటించబోతున్నట్టు ప్రకటించారు మంచు విష్ణు. ఓ కీలక పాత్రలో ఓ పదిహేను నిమిషాల నిడివి గల శక్తివంతమైన పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ చిత్రంలోకి మరో స్టార్‌ హీరో చేరారు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌(Mohanlal) కూడా నటించబోతున్నారు. తాజాగా మంచు విష్ణు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయనతో దిగిన ఫోటోని పంచుకున్నారు. `కన్నప్ప` చిత్రాన్ని మరింత పెద్దది చేసేందుకు మోహన్‌లాల్‌ వస్తున్నారని తెలిపారు. స్వాగతం పలికారు. మరి ఆయన పాత్ర ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. 

Latest Videos

వీరేకాదు నయనతార కూడా ఇందులో నటిస్తుందని సమాచారం. ఆమె పార్వతి పాత్రలో కనిపిస్తుందట. శివుడిగా ప్రభాస్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి బాలీవుడ్‌ దర్శకుడు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్య శ్రీకాళ హస్తిలో ఈ చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇందుకోసం అక్కడ భారీ సెట్స్ వేశారట. 800 మంది సెట్ తయారీ బృందం ఐదు నెలలు కష్టపడి ఈ ఆర్ట్ వర్క్ పూర్తి చేశారని, అందుకు ఎనిమిది కంటెయినర్లలో సెట్‌ ప్రాపర్టీని న్యూజిలాండ్‌కి తరలించినట్టు తాజాగా మంచు విష్ణు ఓ వీడియో ద్వారా వెల్లడించారు. 

`కన్నప్ప` సినిమా షూటింగ్‌ మొత్తం అక్కడే పూర్తి చేయబోతున్నారట. పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, తోటపల్లి సాయి నాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి ఇలా అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచినట్టుగా మంచు విష్ణు తెలిపారు. మోహన్‌బాబు నిర్మించే ఈ చిత్రంలో ఆయన కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. ఇక అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 

vuukle one pixel image
click me!