మోహన్‌బాబు `సన్నాఫ్‌ ఇండియా` షురూ.. స్టయిలీష్‌ మంచు విష్ణు భార్య!

Published : Oct 23, 2020, 06:46 PM ISTUpdated : Oct 23, 2020, 06:51 PM IST
మోహన్‌బాబు `సన్నాఫ్‌ ఇండియా` షురూ.. స్టయిలీష్‌ మంచు విష్ణు భార్య!

సారాంశం

మోహన్‌బాబు నటిస్తున్న `సన్నాఫ్‌ ఇండియా` సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. మోహన్‌బాబుకి శుభాకాంక్షలు తెలిపారు.   

చాలా రోజుల గ్యాప్‌ తర్వాత విలక్షణ నటుడు, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో `సన్నాఫ్‌ ఇండియా` చిత్రం రూపొందుతుంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 15న ఈ సినిమాని ప్రకటించారు. డైమండ్‌ రత్నబాబు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. 

తాజాగా శుక్రవారం ఈ సినిమా ప్రారంభమైంది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. మోహన్‌బాబుకి శుభాకాంక్షలు తెలిపారు. `కంగ్రాట్స్ డాడీ. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నా. బెస్ట్ ఆఫ్‌ లక్‌. నాకు తెలుసు మీ అత్యద్భుతమైన నటనతో అందరిని అలరిస్తారు` అని ట్వీట్‌ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మోహన్‌బాబుకి మంచు విష్ణు భార్య విరానిక స్టయిలీష్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాతో ఆమె స్టయిలిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతుండటం విశేషం. ఈ సినిమాకి ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌
Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం