Dasara Movie : నాని అప్ కమింగ్ ఫిల్మ్ ‘దసరా’మూవీ పూజా కార్యక్రమం పూర్తి.. కీర్తి, నానిలకు ఇది రెండో చిత్రం..

Published : Feb 16, 2022, 05:01 PM IST
Dasara Movie : నాని అప్ కమింగ్ ఫిల్మ్ ‘దసరా’మూవీ పూజా కార్యక్రమం పూర్తి.. కీర్తి, నానిలకు ఇది రెండో చిత్రం..

సారాంశం

న్యాచురల్ స్టార్ నాని (Nani) ‘శ్యామ్ సింగరాయ్’తో సక్సెస్ అందుకున్నాడు. తాజాగా తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘దసరా’ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా ఈరోజు  పూర్తయ్యింది. కీర్తి, నాని కలిసి నటిస్తున్న రెండో చిత్రం ఇది.   

నేను లోకల్ (Nenu Local) తర్వాత నాని, కీర్తి సురేష్‌ల కలయికలో వస్తున్న రెండో చిత్రం ‘దసరా’. నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ (Shyam Singha Roy) చిత్రంతో విజయం సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంలో నాని రెండు పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. శ్యామ్ పాత్రలో నటనకు నానికి ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా నాని నటిస్తున్న తదుపరి చిత్రం 'దసరా'. డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో నాని తెలంగాణ యాసలో డైలాగులు చెప్పబోతున్నాడు. ఆ మధ్యన విడుదలైన మోషన్ పోస్టర్ లో నాని లుక్ రఫ్ గా ఉండబోతున్నట్లు అర్థం అయింది. ఈ చిత్రంలో నాని పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉండబోతున్నాయి. కాగా ఈ మూవీ చిత్రీకరణ పనులు ప్రారంభించనున్నారు. 

 

తాజాగా ఈ రోజు ‘దసరా’ (Dasara) మూవీ టీం హైదరాబాద్‌లో విజయవంతంగా పూజా కార్యక్రమాన్ని ముగించుకుంది. ఈ కార్యక్రమానికి నాని, కీర్తి సురేష్ (Keerthy Suresh) హాజరయ్యారు.  ఈ సందర్భంగా పలు ఫొటోలను చిత్రం యూనిట్ సోషల్ మీడియా వేదికన అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్ వీ సంస్థ నిర్మిస్తుండగా..  మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీత అందించనున్నారు.  ఇప్పటికే నాని ‘అంటే సుందరానికి’ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ వేసవిలో విడుదల కానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద