ఫస్ట్ టైమ్‌ కలిసి నటిస్తున్న మోహన్‌బాబు, మంచు లక్ష్మి.. `అగ్ని నక్షత్రం` తండ్రీకూతుళ్ల విశ్వరూపం

Published : Jul 01, 2022, 03:58 PM IST
ఫస్ట్ టైమ్‌ కలిసి నటిస్తున్న మోహన్‌బాబు, మంచు లక్ష్మి.. `అగ్ని నక్షత్రం` తండ్రీకూతుళ్ల విశ్వరూపం

సారాంశం

తెలుగు తెరపై మొదటిసారి మంచు మోహన్‌బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి కలిసి తెరని పంచుకోబోతున్నారు. అందుకు `అగ్ని నక్షత్రం` సినిమా వేదిక కాబోతుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, కలెక్షన్‌ కింగ్‌గా పేరుతెచ్చుకున్న మంచు మోహన్‌బాబు సినిమాల జోరు పెంచారు. మొన్నటి వరకు ఆచితూచి సినిమాలు చేసిన ఆయనిప్పుడు స్పీడ్‌ పెంచినట్టున్నాడు. ఇటీవల `సన్నాఫ్‌ ఇండియా`తో మెరిసిన మోహన్‌బాబు ఇప్పుడు మరోసినిమా చేయబోతున్నారు. తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి ఫస్ట్ టైమ్‌ ఆయన సినిమా చేయబోతుండటం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌లో `అగ్ని నక్షత్రం` అనే సినిమా రాబోతుంది. 

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్‌మెంట్స్ పతాకాలపై డా.మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో వస్తోన్న `అగ్ని నక్షత్రం` సినిమాకి వారే నిర్మాతలు కావడం విశేషం. ఈ చిత్రాన్ని ప్రీతీక్‌ ప్రజోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సముద్రఖని, మలయాళ నటుడు సిద్ధిక్‌, విశ్వంత్‌, జబర్దస్త్ మహేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేడు శుక్రవారం(జులై 1న) ఈ చిత్ర టైటిల్‌ని విడుదల చేశారు. 

ఈ సినిమాకి సంబంధించిన డిటెయిల్స్ వెల్లడిస్తూ, `తండ్రీకూతుళ్లైన మోహన్‌బాబు, మంచు లక్ష్మి మొదటి సారిగా కలిసి నటించడం విశేషం. మంచి ముహూర్తాన `అగ్ని నక్షత్ర` టైటిల్‌ని రివీల్‌ చేశాం. ఈ చిత్రానికి డైమండ్‌ రత్నబాబు కథ అందించారు. పోలీస్‌ స్టోరీతో విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన సిద్ధిక్‌ విలన్‌గా నటిస్తున్నారు. చైత్ర శుక్ల మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. విశ్వంత్‌ హీరోగా నటిస్తున్నారు. 

ఈ సినిమాకి ఎడిటర్‌గా మధురెడ్డి, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా లిజో కె జోష్‌, గోకుల్‌ భారతి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్‌ చివరిదశలో ఉంది` అని తెలిపింది యూనిట్‌. మోహన్‌బాబు చివరగా `సన్నాఫ్‌ ఇండియా`లో నటించగా, మంచు లక్ష్మికి నటిగా చాలా గ్యాప్‌ వచ్చింది. ఆమెకిది ఓ రకంగా కమ్‌ బ్యాక్‌ లాంటి చిత్రమని చెప్పొచ్చు. తండ్రీ కూతుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఇందులో వీరిద్దరు కలిసి విశ్వరూపం చూపించడం ఖాయమంటున్నారు అభిమానులు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?