`లూసిఫర్‌` రీమేక్‌లోకి ఐదో దర్శకుడు.. చిరుని సాటిస్పై చేస్తాడా?

Published : Nov 21, 2020, 08:10 AM ISTUpdated : Nov 21, 2020, 08:14 AM IST
`లూసిఫర్‌` రీమేక్‌లోకి ఐదో దర్శకుడు.. చిరుని సాటిస్పై చేస్తాడా?

సారాంశం

తెలుగుకి తగ్గట్టుగా `లూసిఫర్‌` రీమేక్‌ స్క్రిప్ట్ ని మౌల్డ్ చేసే పని మొదట `సాహో` ఫేమ్‌ సుజిత్‌కి అప్పగించాడు. ఆయన చాలా రోజులు దీనిపై వర్క్ చేసినా చిరు సాటిస్పై కాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులు బాబీ పనిచేశారు. లాభం లేకుండా పోయింది. 

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాకి దర్శకుల జాబితా పెరిగిపోతుంది. దాన్ని రీమేక్‌ చేసేందుకు ఇప్పటి వరకు నలుగురు దర్శకులు కథపై వర్క్ చేసినా చిరు సంతృప్తి చెందలేదు. ఇప్పుడు ఐదో దర్శకుడి వద్దకు ఆ స్క్రిప్ట్ వెళ్ళింది. మరి ఆ సినిమా ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదే `లూసిఫర్‌` రీమేక్‌. మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన ఈ సినిమాని తెలుగులో చిరంజీవి నటించాలని భావించారు. రీమేక్‌ రైట్స్ కొన్నారు. 

అయితే తెలుగుకి తగ్గట్టుగా `లూసిఫర్‌` రీమేక్‌ స్క్రిప్ట్ ని మౌల్డ్ చేసే పని మొదట `సాహో` ఫేమ్‌ సుజిత్‌కి అప్పగించాడు. ఆయన చాలా రోజులు దీనిపై వర్క్ చేసినా చిరు సాటిస్పై కాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులు బాబీ పనిచేశారు. లాభం లేకుండా పోయింది. ఇక తనకు `ఠాగూర్‌`, `ఖైదీ నెం.150` చిత్రాలను అందించిన వి.వి.వినాయక్‌ని రంగంలోకి దించాడు చిరు.  వినాయక్‌ సైతం చిరుని సంతృప్తి పరిచేలా కథని తీర్చిదిద్దలేకపోయారు. 

దీంతో పవన్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఈ సినిమా కథపై వర్క్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. తమిళ దర్శకుడు మోహన్‌ రాజా వద్దకు ఈ రీమేక్‌ వెళ్ళిందట. బేసిక్‌గా రీమేక్‌ చిత్రాలను రూపొందించడంతో మోహన్‌ రాజా ఎక్స్ పర్ట్ అనే పేరుంది. మరి ఆయన అయినా ఈ స్క్రిప్ట్ ని చిరుకి తగ్గట్టు మౌల్డ్ చేస్తారా? లేక మరో దర్శకుడి వద్దకు వెళ్లాల్సి వస్తుందా? అనేది చూడాలి. తమిళ హీరో జయంరవి అన్నయ్యే మోహన్‌రాజా. 

ప్రస్తుతం చిరు `ఆచార్య`లో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కాగా, శుక్రవారం నుంచి చిరు షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. కాజల్‌ ఇందులో హీరోయిన్‌. ఆమె డిసెంబర్‌ 5 నుంచి చిత్రీకరణలో జాయిన్‌ అవుతుందట. కొరటాల శివ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌,నిరంజన్‌రెడ్డి నిర్మిస్తుండగా, రామ్‌చరణ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్