'ఫసక్' మీమ్స్ పై మోహన్ బాబు కామెంట్!

Published : Sep 04, 2018, 11:06 AM ISTUpdated : Sep 09, 2018, 11:21 AM IST
'ఫసక్' మీమ్స్ పై మోహన్ బాబు కామెంట్!

సారాంశం

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో వాడిన 'ఫసక్' అనే డైలాగ్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ పదంపై రకరకాల మీమ్స్ చేస్తూ మోహన్ బాబు కొత్త పదం కనిపెట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో వాడిన 'ఫసక్' అనే డైలాగ్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ పదంపై రకరకాల మీమ్స్ చేస్తూ మోహన్ బాబు కొత్త పదం కనిపెట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల మంచు లక్ష్మితో కలిసి ఇండియా టుడే కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు మోహన్ బాబు. ఈ క్రమంలో 'ఎం ధర్మరాజు ఎంఏ' సినిమాలో ఓ డైలాగ్ ను తనదైన స్టయిల్ లో పవర్ ఫుల్ గా ఇంగ్లీష్ లో చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ సమయంలో ఫసక్ అనే పదాన్ని వాడారు. ఆయన నోటి నుండి ఎప్పుడైతే ఈ పదం బయటకి వచ్చిందో.. అప్పటినుండి సోషల్ మీడియాలో ఈ పదంపై ఫన్నీ వీడియోలు, మీమ్స్ వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించారు మోహన్ బాబు. తనపై చేస్తోన్న ఈ ట్రోలింగ్ పై మోహన్ బాబు చాలా కూల్ గా స్పందించడం ఆశ్చర్యపరిచింది. ''ఫసక్ అనే పదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందని తెలిసి బాగా అనిపించింది.

ఈ పదంపై దాదాపు 200 ఫన్నీ వీడియోలు వచ్చినట్లుగా విష్ణు చెప్పాడు. అందులో కొన్ని చూశాను. చాలా ఫన్నీగా ఉన్నాయి'' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. మరి మోహన్ బాబు ఇలా కూల్ గా స్పందించారు కాబట్టి ఈ వీడియోల నంబర్ పెరుగుతుందే కానీ తగ్గదనే చెప్పాలి! 

 

PREV
click me!

Recommended Stories

Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే
2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్