నేను నా కథకి మాత్రమే బానిసని, రాజమౌళిపై డాక్యుమెంటరీ ఫిలిం.. ట్రైలర్ చూశారా

Published : Jul 22, 2024, 01:11 PM IST
నేను నా కథకి మాత్రమే బానిసని, రాజమౌళిపై డాక్యుమెంటరీ ఫిలిం.. ట్రైలర్ చూశారా

సారాంశం

దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచ స్థాయిలో సినీ దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగారు. తన విజన్, సినిమా మేకింగ్ తో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ దుసుకుపోతున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచ స్థాయిలో సినీ దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగారు. తన విజన్, సినిమా మేకింగ్ తో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ దుసుకుపోతున్నారు. రాజమౌళి నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా మహేష్ బాబుతో చిత్రానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. 

రాజమౌళి అంతటి గొప్ప దర్శకుడి గురించి ఆడియన్స్ కి చెప్పడం కోసం అతనిపై నెట్ ఫ్లిక్స్ సంస్థ డాక్యుమెంటరీ చిత్రం రూపొందించింది. మోడ్రన్ మాస్టర్స్ -ఎస్ ఎస్ రాజమౌళి పేరుతో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే రాజమౌళికి సినిమా పట్ల ఉన్న అభిప్రాయం ఏంటి? ఆయనతో వర్క్ చేసిన నటీనటులు.. ఇతర దర్శకులు రాజమౌళి గురించి ఏం చెబుతున్నారు ? 

 

తెర వెనుక సినిమా బాగా రావడం కోసం రాజమౌళి ఎంతలా కష్టపడతారు లాంటి విషయాలని చూపించారు. రాజమౌళితో పనిచేసిన ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్ ప్రశంసలతో ముంచెత్తుతూ కనిపిస్తున్నారు. ఇక షూటింగ్ జరిగే సమయంలో రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని నటీనటులకు ఎలా చేసి చూపిస్తారో అనే దృశ్యాలని కూడా ట్రైలర్ లో ప్రదర్శించారు. 

త్వరలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. చివర్లో రాజమోళి చెప్పే మాటతో ట్రైలర్ ముగుస్తుంది. నేను నా కథకి మాత్రమే బానిసని అని రాజమౌళి అంటారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌