నిత్యా మీనన్, రీతూ వర్మ, అభిజీత్, ఆది పినిశెట్టి కొత్త వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ ఇదిగో

Published : Jun 22, 2022, 03:03 PM ISTUpdated : Jun 22, 2022, 03:07 PM IST
నిత్యా మీనన్, రీతూ వర్మ, అభిజీత్, ఆది పినిశెట్టి కొత్త వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ ఇదిగో

సారాంశం

క్రేజీ హీరోయిన్ నిత్యా మీనన్, రీతూ వర్మ, బిగ్ బాస్ విన్నర్ అభిజీత్, ఆది పినిశెట్టి కలసి నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ' మోడరన్ లవ్ హైదరాబాద్'.

ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో వెబ్ సిరీస్ లు మోతెక్కుతున్నాయి. పలు ఓటిటి సంస్థలు యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిన్న సినిమాలకు థియేటర్స్ లో పరిస్థితి దారుణంగా ఉంది. థియేటర్స్ లో చిన్న సినిమాలకు ఆదరణ బాగా తగ్గింది. దీనితో చిన్న హీరోలు, నటీమణులంతా వెబ్ సిరీస్ లవైపు ఆసక్తి చూపుతున్నారు. 

క్రేజీ హీరోయిన్ నిత్యా మీనన్, రీతూ వర్మ, బిగ్ బాస్ విన్నర్ అభిజీత్, ఆది పినిశెట్టి కలసి నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ' మోడరన్ లవ్ హైదరాబాద్'. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో జూలై 8 నుంచి రిలీజ్ కానుంది. ఈ మేరకు ప్రకటన చేస్తూ అమెజాన్ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో ప్రధాన నటీనటులంతా కనిపిస్తున్నారు. 

నలుగురు యువ దర్శకులు నగేష్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బాహుదానం 6 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ని చిత్రీకరించారు. సుహాసిని, కోమలి కీలక పాత్రల్లో నటించారు. ఇదే తరహాలో అమెజాన్ సంస్థ నెల క్రితం మోడ్రన్ లవ్ ముంబై సిరీస్ ని విడుదల చేసింది. ఇప్పుడు హైదరాబాద్ నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కించారు. 

నిత్యామీనన్ నటనతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆది పినిశెట్టి తెలుగు తమిళ భాషల్లో గుర్తింపు పొందారు. అభిజీత్ బిగ్ బాస్ తో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. యంగ్ బ్యూటీగా రీతూ వర్మ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్లంతా మోడ్రన్ లవ్ హైదరాబాద్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే