ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన ‘నాటు నాట’ సాంగ్ పై కీరవాణి తండ్రి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆపాటపై తనకున్నఅభిప్రాయాన్ని వ్యక్తం పరిచారు.
సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’కు ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. భారతీయులు కలగా భావించిన ఆస్కార్ అవార్డును ‘నాటు నాటు’తో సాకారం చేయడంతో ఇండియన్స్ గర్విస్తున్నారు. సినీ ప్రముఖులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు సంతోషిస్తున్నారు.‘ఆర్ఆర్ఆర్’ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (Keeravani) తండ్రి కూడా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఆ సాంగ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే క్రమంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కీరవాణి తండ్రి, ప్రముఖ లిరిసిస్ట్ శివ శక్తి దత్తా (Shiva Shakti Dutta) తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నాటు నాటు’పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘కీరవాణి నా పంచ ప్రాణాలు. మూడవ ఏటనే అతనికి సంగీతం నేర్పించాను. నేనే ఆయనకు ఆదిగురువు. నేను రాసే పాటలకు ట్యూన్ చేస్తూ సంగీతం నేర్చుకున్నారు. కీరవాణి తన నైపుణ్యంతో ఎప్పటికప్పుడు నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. అయితే ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు సాంగ్ మాత్ర పెద్దగా నాకు నచ్చలేదు.
అసలు అది పాటేనా? అందులో సంగీతం అంటూ ఉందా? కీరవాణి ఇచ్చిన సంగీతంతో పొల్చితే ఇదొక మ్యూజికేనా అని ప్రశ్నించారు. విధి అలా జరగాలని ఉంది. చంద్రబోస్ రాసిన ఐదు వేల పాటల్లో ఇదొక పాటనా? అంటూ షాకింగ్ గా స్పందించారు. అయితే ‘నాటు నాటు’లో మాత్రం ఆయనకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ మాత్రం అద్భుతంగా నచ్చిందని తెలిపారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ బాగా డాన్స్ చేశారని ప్రశంసించారు. కానీ ఈ రూపంలో కీరవాణి, చంద్రబోస్ కు ఆస్కార్ అందడం సంతోషకరమేనన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ఈక్రమంలో తమ ఫ్యామిలీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ అంశాలను తెలిపారు. అలాగే కీరవాణికి సంగీతమే కాకుండా.. కామెడీ, బుక్స్, రచనలు, ఫ్యామిలీతో సమయం గడపటం చాలా ఇష్టం అంటూ చెప్పొకొచ్చారు. మార్కెట్లో కొత్తగా వచ్చిన గాడ్జెట్స్ ను వెంటనే కొంటుంటాడనీ కూడా చెప్పారు. ఇక మార్చి 13అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో గల డాల్బీ థియేటర్ లో ఆస్కార్స్ వేదికపై ఎంఎం కీరవాణి, చంద్రబోస్ (Chandrabose) అవార్డును స్వీకరించిన విషయం తెలిసిందే. వేదికపై ‘నాటు నాటు’ లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్ తో కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ కూడా అదరగొట్టారు.