రాజమౌళిపై ఎంఎం కీరవాణి ఫైర్.? SSMB29 అప్డేట్ అడిగితే.. ఫోన్ స్విచ్ఛాఫ్ అంట!

Published : Jan 09, 2024, 01:23 PM IST
రాజమౌళిపై ఎంఎం కీరవాణి ఫైర్.? SSMB29 అప్డేట్ అడిగితే.. ఫోన్ స్విచ్ఛాఫ్ అంట!

సారాంశం

ఎస్ఎస్ రాజమౌళి తన పెద్దన్న ఎంఎం కీరవాణి MM Keeravaniకి ఎంతటి గౌరవమిస్తారో తెలిసిందే. అలాగే కీరవాణీ కూడా రాజమౌళి పట్ల అమితమైన ప్రేమను చూపిస్తుంటారు. కానీ దర్శకధీరుడు చేసే కొన్ని పనులకు కీరవాణీ విసుగెత్తిపోతుంటారు. 

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి గొప్ప చిత్రాలను నిర్మించిన ఎస్ఎస్ రాజమౌళి (SS Rajmouli) ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. దీంతో ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నెక్ట్స్ రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో భారీ అడ్వెంచర్ ఫిల్మ్ చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మూవీ ఈ ఏడాది ప్రారంభం కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ చకాచకా కొనసాగుతున్నాయి. 

అయితే... తాజాగా ఎంఎం కీరవాణీ జక్కన్న చేసిన పనికి విసుగెత్తిపోయారు. ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన కీరవాణీకి SSMB29 అప్డేట్ పై ప్రశ్న ఎదురైంది. అండ్వెంచర్ ఫిల్మ్ కు ఎంఎం కీరవాణీకి సంగీతం సమకూర్చబోతున్న విషయం తెలిసిందే. అయితే, తాజా ఇంటర్వ్యూలో SSMB29 Movie మ్యూజిక్ పై అప్డేట్ ఏంటని అడగ్గా ఫన్నీగా బదులిచ్చారు. 

ఆ సినిమా కోసం అడుగుదామని ఫోన్ చేస్తే రాజమౌళి ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉంటుంది. నాకూ ఫోన్ రాలేదు. అంటే నా దాకా ఇంకా రాలేదని అర్థం. ఇంక సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయం తనకు తెలియదన్నారు. ఆ విషయాన్ని రాజమౌళినే అడిగి తెలుసుకోవాలన్నారు. ఇక పెద్దన్న జక్కన్నపై ఇలా ఫన్నీగా స్పందించారు. గతంలో ‘బాహుబలి’ మూవీ విడుదల తర్వాత వచ్చిన మేకింగ్ గ్లింప్స్ లోనూ రాజమౌళిపై ఫన్నీ కామెంట్స్ చేశారు. 

ఇక రాజమౌళి మొదటి సినిమా నుంచి ఇప్పటికీ ప్రతి సినిమాకు ఎంఎం కీరవాణీనే సంగీతం అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాలతో అద్భుతమైన గీతాలను అందించారు. RRRలోని ‘నాటు నాటు’ సాంగ్ కు ఏకంగా ప్రతిష్టాత్మకమైన Oscar అవార్డును కూడా కీరవాణి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!