హీరోగా మిథున్‌ చక్రవర్తి కుమారుడు టాలీవుడ్‌ ఎంట్రీ.. ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్

Published : Feb 25, 2023, 09:28 PM IST
హీరోగా మిథున్‌ చక్రవర్తి కుమారుడు టాలీవుడ్‌ ఎంట్రీ.. ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్

సారాంశం

విలక్షణ నటుడు, జాతీయ అవార్డు విన్నర్‌ మిథున్‌ చక్రవర్తి ఇటీవల `ది కాశ్మీర్‌ ఫైల్స్` చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. తాజాగా ఆయన కుమారుడు హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. 

మిథున్‌ చక్రవర్తి ఇండియన్‌ సినిమాపై తనదైన ముద్ర వేసుకున్నారు. విలక్షన్‌ నటుడిగా మెప్పించారు. ప్రధానంగా హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించి సూపర్‌స్టార్‌గా వెలిగిన ఆయన తెలుగులోకి `గోపాల గోపాల` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత `మలుపు` చిత్రంలో నటించారు. ఇటీవల `ది కాశ్మీర్‌ ఫైల్స్` చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. తాజాగా ఆయన కుమారుడు టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. మిథున్‌ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగులో హీరోగా ఎంట్రీ ఇస్తూ `నేనెక్కడున్నా` అనే చిత్రంలో నటిస్తున్నారు. 

నూతన దర్శకుడు మాధవ్‌ కోదాడ డైరెక్టర్‌గా పరిచయం అవుతూ `నేనెక్కడున్న` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక నటిస్తుండటం విశేషం. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌, టీజర్‌ని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందానికి విషెస్‌ తెలియజేశారు. 

`టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా` అని సురేష్‌బాబు తెలిపారు. చిత్ర దర్శకుడు మాధవ్ కోదాడ మాట్లాడుతూ ''జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది. ఈ సినిమాతో హిందీ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది` అని చెప్పారు. 

చిత్ర నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ''సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ముంబై, హైదరాబాద్, బెంగళూరులో షూటింగ్ చేశాం. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్నాం. స్టోరీ, మ్యూజిక్, విజువల్స్, డైరెక్షన్ మా సినిమాకు బలం. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో రష్యన్ డాన్సర్లతో చేసిన పబ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సెన్సార్ పూర్తయ్యాక విడుదల తేదీ వివరాలు వెల్లడిస్తాం. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, శయాజీ షిండే, అభిమన్యు సింగ్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, సీవీఎల్ నరసింహారావు, రవి కాలే, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, భాను చందర్, రమణ చల్కపల్లి, మిలింద్ గునాజి, మిహిర, ఉత్తర తదితరులు నటించిన ఈ చిత్రానికి డాన్స్ :  ప్రేమ్ రక్షిత్, లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ, స్టంట్స్ : శంకర్ , మాధవ్ కోదాడ, ఎడిటింగ్ : ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జయపాల్ నిమ్మల, సంగీతం : శేఖర్ చంద్ర, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : రాజేష్ ఎస్ఎస్, సహ నిర్మాత : రమణారావు బసవరాజు, సమర్పణ : కె.బి.ఆర్, నిర్మాత :  మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి, స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ - డైరెక్షన్ : మాధవ్ కోదాడ.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌