విక్రమ్ 'మిస్టర్‌ కేకే' పరిస్దితి అంత దారుణమా?

By tirumala ANFirst Published Jul 20, 2019, 11:43 AM IST
Highlights

ట్రైలర్, టీజర్ లతో క్రేజ్ క్రియేట్ చేసిన సినిమాకు మినిమం ఓపినింగ్స్ వస్తాయని ఎవరైనా భావిస్తారు. అయితే మిస్టర్ కేకే కు ఆ అదృష్టం లేదు. ఈ సినిమాకు రిలీజ్ సమయం దగ్గరపడే కొలిదీ ప్రమోషన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. 

 

ట్రైలర్, టీజర్ లతో క్రేజ్ క్రియేట్ చేసిన సినిమాకు మినిమం ఓపినింగ్స్ వస్తాయని ఎవరైనా భావిస్తారు. అయితే మిస్టర్ కేకే కు ఆ అదృష్టం లేదు. ఈ సినిమాకు రిలీజ్ సమయం దగ్గరపడే కొలిదీ ప్రమోషన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. తెలుగులో పట్టించుకునే నాధుడే లేడు. అందుకు కారణం సినిమా ని తీసుకుని రిలీజ్ చేసే వాళ్లు లేకపోవటం. దాంతో ఎంతో ఉత్సాహంగా రిలీజ్ చేద్దామని రంగంలోకి దిగిన నిర్మాతలు డల్ అయ్యిపోయారు. 

అడ్వాన్స్ లతో ప్రమోట్ చేద్దామనుకున్నా..ఆ పరిస్దితి కనపడలేదు. ఈ ఎఫెక్ట్ లు అన్నీ ఓపినింగ్స్ పై పడ్డాయి. దాంతో అసలు థియోటర్ ఆక్యుపెన్సీ  అనేది రెండు రాష్ట్రాల్లోనూ లేదు. సోషల్ మీడియా లో అయితే ఈ సినిమా గురించి డిస్కషనే లేదు. మరో ప్రక్క ఇస్మార్ట్ శంకర్ దుమ్ము దులిపేస్తోందని, మాస్ సినిమా అని మీడియా ఊదరకొడుతూ దీని విషయం లైట్ తీసుకుంది. ఇలా కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు విక్రమ్ సినిమా దారుణమైన డిసాస్టర్ అవటానికి ఇదొక కారణం. అసలు ఓపినింగ్స్ తెచ్చుకుంటే బాగుందో..లేదో జనాల్లోకి టాక్ వెళ్లటానికి అకాసం ఉండేది. 

 విక్రమ్‌ హీరోగా అక్షరహసన్‌, అభిహసన్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'మిస్టర్‌ కేకే'. . రాజేష్‌ ఎం సెల్వ దర్శకత్వం లో తమిళంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ నిర్మాణంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ కె.రవిచంద్రన్‌ బ్యానర్‌పై 'కదరమ్‌ కొండన్‌' పేరుతో రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో టి.నరేష్‌ కుమార్‌, టి.శ్రీధర్‌ సంయుక్తంగా 'మిస్టర్‌ కేకే' పేరుతో విడుదల చేసారు. 
 
ఏదైమైనా కమల్ హాసన్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అని తేలిపోయింది. అసలు కమల్, విక్రమ్ ఇలాంటి సినిమాని ఎలా ఓకే చేసారనేది మిస్టరీ గా చెప్తున్నారు. తాను చేయాల్సిన పాత్ర‌ని విక్ర‌మ్‌కి ఇచ్చానని కమల్ చెప్తున్నారు. కానీ సినిమా చూసిన త‌ర్వాత అస‌లు ఇది క‌మ‌ల్ కానీ, విక్ర‌మ్ కానీ ఎందుకు ఒప్పుకున్నారో అని తిట్టుకునే పరిస్దితి. ఎటుచూసినా విక్రమ్ కు మరోసారి భాక్సాఫీస్ దగ్గర పెద్ద దెబ్బే పడింది.

click me!