
తెలుగు వారి కీర్తి పతాక, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామరావు.. శతజయంతి ఉత్సవాలను బెజవాడలో గ్రాండ్ గా నిర్వహించారు. విజయవాడలోని పోరంకిలో గల అనుమలు గార్డెన్స్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ తో పాటు .. ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా ఈవేడుకల్లో సందడి చేశారు. ఇక ఈ వేడుకకు గెస్ట్ గా వచ్చిన రజనీకాంత్ మాట్లాడుతూ.. బాలయ్యను సరదాగా టీజ్ చేశారు.
ఈ వేడుకల్లో రజనీకాంత్ ప్రసంగిస్తూ.. బాలయ్య గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. బాలయ్య కంటి చూపుతోనే చంపేస్తాడని.. ఒక్క సారి కోపంగా చూస్తే.. కార్లు.. బండ్లు.. అంత ఎత్తునఎగిరి.. పడిపోతాయని.. ఒక తన్ను తంతే జీపు 30 అడుగుల దూరంలో ఎగిరి పడుతుంది...అంత పవర్ ఉంది.. ఆయనకు. ఈ సీన్స్ తను కాని.. అమితాబ్ బచ్చన్, సల్మాన్ వంటి హీరోలు చేయలేరని, చేసినా కూడా ఆడియన్స్ ఫ్యాన్స్ ఒప్పుకోరన్నారు. అది బాలయ్య కు మాత్రమే సాధ్యమన్నారు రజనీకాంత్. అంతే కాదు బాలయ్ కోపిస్టి అంటూ సూపర్ స్టార్ అనగానే అంతా షాక్ అయ్యారు. అయితే ఆయన మనసు మాత్రం వెన్నెలాంటిది.. ఆయన ఆలోచన బాల్ లాగా ఉంటుంది అన్నారు.
బాలయ్య అంటే ఫ్యాన్స్.. అభిమానంతో ఊగిపోతారన్నారు రజనీకాంత్. తెలుగు ప్రజలు బాలయ్యను బాలయ్యలా చూడలేదు. మహానుభావుడు ఎన్టీఆర్‌ను బాలయ్యలో చూసుకున్నారు అన్నారు. ఆ ఎన్టీఆర్ యుగపురుషుడు ఏమైనా చేయగలరు కదా. అలానే బాలయ్య కూడా అన్నీ చేస్తాడు. కాకపోతే చాలా కోపిష్టి.. కానీ పాల లాంటి మనసు.. అంటూ బాలయ్య గురించి రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇక చంద్రబాబు గురించి కూడా రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు చంద్రబాబు నాయుడిని మోహన్ బాబు పరిచయం చేశారని.. వేదిక మీద చంద్రబాబు నాయుడు ఉంటే.. రాజకీయాల గురించి తప్పకుండా ప్రస్తావించాలి అన్నారు. తనకు 1996 లోనే విజయ్ 2020 గురించి ఆయన చెప్పారి. ఈ మధ్య హైదరాబాద్ వెళ్లినప్పుుడ చూస్తే.. నేను ఇండియాలోనే ఉన్నానా.. లేక ఫారెన్ లో ఉన్నానా అనిపించింది. ఆయన విజన్ అలా ఉంటుది అన్నారు. ప్రస్తుతం ఆయన విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారంటూ పొగడ్తలతో ముంచెతారు. ఐటీ ప్రాధాన్యతను గుర్తించి చంద్రబాబు హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చారు. నేడు లక్షల మంది తెలుగు ప్రజలు ఐటీలో పనిచేస్తూ లగ్జరీగా బతుకుతున్నారంటే అందుకు చంద్రబాబు నాయుడే కారణం అంటూ ప్రశంసలు కురిపించారు.