Sirivennela Seetharama Sastry Death: ఆయన పాట పండగలా వుంటుంది : సిరివెన్నెలకు తలసాని నివాళులు

By Siva KodatiFirst Published Dec 1, 2021, 10:44 AM IST
Highlights

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై సంతాపం తెలిపారు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav). బుధవారం ఫిల్మ్‌ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌ (telugu film chamber of commerce) వద్ద సిరివెన్నెల భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై సంతాపం తెలిపారు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav). బుధవారం ఫిల్మ్‌ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌ (telugu film chamber of commerce) వద్ద సిరివెన్నెల భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు . అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. తొలి చిత్రంతోనే ఆయన నంది అవార్డ్ అందుకున్నారని ప్రశంసించారు. 11 సార్లు నంది అవార్డ్, పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారని తలసాని గుర్తుచేశారు. అందరికీ అర్ధమయ్యేలా ఆయన పాటలు వుంటాయని అన్నారు. 

చాలా చిన్న వయసులోనే .. అనారోగ్యం కారణంగా వారు మరణించడం బాధాకరమని తలసాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత కోలుకుంటారని తాను ఆశించానని కానీ ఆయనను కాపాడుకోలేకపోయామన్నారు. సిరివెన్నెల మృతిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి సంతాపం తెలియజేశారు. సీతారామశాస్త్రిని ఆదర్శంగా తీసుకుని యంగ్ జనరేషన్ ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. సిరివెన్నెల పాటల్లో అర్ధం, పరమార్ధం వుంటుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు. ఆయన మరణం వారి కుటుంబానికే కాక, తెలుగు ప్రజలకు, తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని నష్టమని మంత్రి అన్నారు. అందరూ పుడుతూ వుంటారు.. మరణిస్తూ వుంటారు. కానీ కొంతమందే చరిత్రలో మిగిలిపోతారని.. ఆ కోవలోకి చెందిన వ్యక్తే సిరివెన్నెల సీతారామశాస్త్రి అని తలసాని ప్రశంసించారు. 

Also Read:ఆ సినిమాల కోసం నయా పైసా తీసుకోకుండా పాటలు రాసిన సిరివెన్నెల... సీతారామశాస్త్రి పాటల ప్రస్తానంలో...

కాగా.. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24నే ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే మంగళవారం సిరివెన్నెల ఆరోగ్యం మరింత విషమించడంతో సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 

దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. Sirivennela Seetharama Sastry Dead మరణంతో టాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌ కి గురైంది. మే 20, 1955న విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో డాక్టర్‌ సి.వి.యోగి, సుబ్బలక్ష్మి గార్లకి సిరివెన్నెల జన్మించారు. అనకాపల్లిలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్మీడియన్‌ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌లో బి.ఏ పూర్తి చేశారు. ఎం.ఏ చేస్తుండగా, ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు కె.విశ్వనాథ్‌.. `సిరివెన్నెల` సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. అలా 1986లో సిరివెన్నెల కెరీర్‌ ప్రారంభమైంది. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. కానీ తొలి చిత్రం `సిరివెన్నెల`నే ఆ తర్వాత తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. 

మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో మూడు వేలకుపైగా పాటలు రాశారు సిరివెన్నెల. `విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం` సిరివెన్నెల రాసిన తొలిపాట. చివరగా ఆయన అఖిల్‌ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో `చిట్టు అడుగు` అనే పాటని రాశారు. వేటూరి శిష్యుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న సిరివెన్నెల పాటలరచయిత మాత్రమే కాదు, కవి, సింగర్‌ కూడా. `గాయం` సినిమాలో `నిగ్గ దీసి అడుగు.. `అనే పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. జనాన్ని చైతన్య పరిచే ఈ పాట ఊర్రూతలూగించింది. గాయకుడిగా సిరివెన్నెలలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. 
 

click me!