
చాలా తక్కువ కాలం అసిస్టెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ... హీరో నాగార్జునను ఇంప్రెస్ చేసి శివ చిత్రానికి ఒప్పించారు. ఈ మూవీకి అసిస్టెంట్స్ గా పలువురు స్టార్ డైరెక్టర్స్ పని చేశారు. గుణశేఖర్, కృష్ణవంశీ వంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ వర్మ శిష్యులే. టాలీవుడ్ ని షేక్ చేసిన మరొక డైనమిక్ డైరెక్టర్ కూడా శివ చిత్రానికి పని చేశాడు. అయితే చిన్న బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా. ఆయనెవరో కాదు పూరి జగన్నాధ్. ఈయన కూడా వర్మ స్కూల్ నుండి వచ్చిన వాడే.
శివ చిత్రం నాటికే పరిశ్రమకు వచ్చిన పూరి జగన్నాధ్ ఆ మూవీలో పాత్ర చేశాడు. నాగార్జున స్టూడెంట్స్ గ్యాంగ్ లో ఒకడిగా కనిపించాడు. పూరి రోల్ కి ఎలాంటి డైలాగ్స్ కూడా ఉండవు. జస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్. అలాంటి వాడు తన ప్రతిభతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. పూరి జగన్నాధ్ త్రో బ్యాక్ పిక్ షేర్ చేసిన వర్మ అతను కెరీర్లో ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం అని తెలియజేశాడు.
కాగా పూరి పరిస్థితి బాగోలేదు. ఒకప్పుడు పూరి స్టార్ హీరోల ఛాయిస్. కానీ ఇప్పుడు టైర్ టూ హీరోలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇస్మార్ట్ శంకర్ తో కమ్ బ్యాక్ అయ్యాడనుకుంటే లైగర్ మరలా దెబ్బేసింది. రామ్ పోతినేని ఆఫర్ ఇవ్వడంతో మెగా ఫోన్ పట్టాడు. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. జులై 12 నుండి ముంబైలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. హీరోయిన్, ఇతర నటుల వివరాలు తెలియాల్సి ఉంది.