నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా 'మేమ్ ఫేమస్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్..

Published : May 17, 2023, 10:35 PM IST
నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా 'మేమ్ ఫేమస్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్..

సారాంశం

పెద్ద సినిమాలు వాటి పని అవి చూసుకుంటుంటే.. చిన్న సినిమాలు కూడా మధ్యలోసత్తా చాటుతున్నాయి. ఆకోవలోదే మేమ్ ఫేమస్ మూవీ.. రిలీజ్ కు రెడీ అవుతోంది. 

 

పెద్ద సినిమాలు.. భారీ బడ్జెట్ సినిమాలు ఎన్ని వచ్చినా.. చిన్న సినిమాల జోరు మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు పెద్ద హిట్లను ఖాతాలో వేసుకుంటున్నాయి. అలా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో సినిమానే 'మేమ్ ఫేమస్'. గ్రామీణ నేపథ్యం కలిగిన కథతో తెరకెక్కిన ఈసినిమాను అనురాగ్ రెడ్డి .. శరత్ చంద్ర .. చంద్రు నిర్మించగా.. సుమంత్ ప్రభాస్ దర్శకత్వం వహించాడు. 

ఈ మూవీ నుంచి వచ్చిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈమూవీకి సబంధించిన ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు టీమ్. ఈ ఈవెంటుకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ నేచురల్ స్టార్ నానీ రాగా.. ఇతరఅతిథులుగా ...  డైరెక్టర్లు బుచ్చిబాబు సాన,  - శ్రీకాంత్ ఓదెల ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. నాని చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. యూత్ ను ఎంకరేజ్ చేయండి అనే లైన్ పై నడిచే కథ ఇది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా  విడుదలవుతోంది.

విలేజ్ బ్యాక్ డ్రా్ తో..  ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే  కథ ఇది అని తెలుస్తోంది.ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా అలానే ఆకుట్టుకుంటుందనినమ్ముతున్నారు మేకర్స్.. ముగ్గురు స్నేహితులు తమ ఊళ్లో పనీపాటా లేకుండా తిరుగుతుంటారు. తల్లిదండ్రుల చేత చీవాట్లు తింటూ ఉంటారు. ఈ ముగ్గురికీ కూడా ఎవరి ప్రేమకథలు వారికి ఉంటాయి. అయితే వీళ్ల తీరు వలన పిల్లను ఇవ్వడానికి అమ్మాయిల పేరెంట్స్ కూడా ఇష్టపడరు. అప్పుడు ఈ కుర్రాళ్లు ఏం చేశారనేది కథ. 
 

PREV
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?