పదిరోజులకి ఎంత తీసుకుంటుందో తెలుసా..?

Published : Sep 24, 2018, 06:04 PM IST
పదిరోజులకి ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సారాంశం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన సినిమాల్లో స్టార్ హీరోయిన్లు ఉండేలా చూసుకుంటాడు. కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అతడు తను నటించే సినిమాల్లో స్టార్ కాస్టింగ్ ఉండేలా చూసుకుంటుంటాడు. 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన సినిమాల్లో స్టార్ హీరోయిన్లు ఉండేలా చూసుకుంటాడు. కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అతడు తను నటించే సినిమాల్లో స్టార్ కాస్టింగ్ ఉండేలా చూసుకుంటుంటాడు.

ఐటెం సాంగ్ లోనైనా స్టార్ హీరోయిన్ తో స్టెప్పులు వేయించాల్సిందే. ఈ క్రమంలో అతడు నటిస్తోన్న నూతన చిత్రంలో హీరోయిన్ గా కాజల్ కనిపించనుంది. మరో ముఖ్య పాత్ర కోసం మెహ్రీన్ ని తీసుకున్నారు. మెహ్రీన్ ది ఈ సినిమాలో పూర్తి స్థాయి హీరోయిన్ పాత్ర కాదు. ఆమె స్పెషల్ రోల్ లో కనిపించనుంది.

కేవలం పది రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొనుంది. దీనికోసం అమ్మడు ఎంత పారితోషికం తీసుకోబోతుందో తెలుసా..? అక్షరాలా రూ.70 లక్షలు. నిజానికి ఇది ఆమె రెగ్యులర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ కంటే చాలా ఎక్కువ. సినిమాకు అరకోటి చొప్పున తీసుకున్న మెహ్రీన్ కేవలం పది రోజుల కాల్షీట్స్ కోసం ఇంత మొత్తాన్ని అందుకోవడం విశేషమనే చెప్పాలి. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు