పూజాహెగ్డే మాటలు విని అవాక్కయిన తారక్, త్రివిక్రమ్!

By Udayavani DhuliFirst Published Sep 24, 2018, 5:38 PM IST
Highlights

'అరవింద సమేత' సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ ఓ పక్కన జరుగుతుండగా మరో పక్కన పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులను పూర్తి చేస్తోంది చిత్రబృందం. 

'అరవింద సమేత' సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ ఓ పక్కన జరుగుతుండగా మరో పక్కన పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులను పూర్తి చేస్తోంది చిత్రబృందం. దాదాపు సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని అనుకుంటున్న సమయంలో పూజా హెగ్డే రూపంలో త్రివిక్రమ్ కి పెద్ద షాక్ తగిలిందని తెలుస్తోంది.

నిజానికి పూజా హెగ్డేకి తెలుగు అంతగా రాదు. అలాంటిది ఆమెతో డబ్బింగ్ చెప్పించాలని ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. మొదట దీనికి పూజా నిరాకరించినా.. త్రివిక్రమ్ సపోర్ట్ చేయడంతో ఓకే చెప్పింది.

తెలుగు డైలాగులు పలకడంలో పూజాకి స్వయంగా ట్రైనింగ్ ఇవ్వాలని భావించాడు త్రివిక్రమ్. కానీ తనకున్న పనులతో పూజా డబ్బింగ్ బాధ్యతలు తన సహాయకులకు అప్పగించాడు. మరి టీమ్ సరిగ్గా కేర్ తీసుకోలేదో..? లేక పూజానే సరిగ్గా చెప్పలేకపోయిందో..? కానీ ఆమె చెప్పిన డైలాగులు త్రివిక్రమ్ కి అర్ధంకాక తలపట్టుకున్నాడట. ఈ విషయంలో కలుగజేసుకున్న హీరో తారక్ పూజా పాత్రకి మరొకరితో డబ్బింగ్ చెప్పించాలి సూచించినట్లు తెలుస్తోంది. 

click me!