పూరీ ఖాతాలో మరో ప్లాప్..?

Published : May 11, 2018, 10:50 AM IST
పూరీ ఖాతాలో మరో ప్లాప్..?

సారాంశం

మెహబూబా ట్విట్టర్ రివ్యూ

‘పూరీ జగన్నాథ్’.. ఇది పేరు కాదు.. బ్రాండ్. ఒకప్పుడు  డైరెక్టర్ పూరీ గురించి అందరూ ఇలానే మాట్లాడుకునే వారు. ఆయన సినిమా తీస్తే.. పక్క హిట్ అనే టాక్ వినపడేది. మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్ మెన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించాడు. కానీ.. గత కొంతకాలంగా పూరీకి కలిసిరావడం లేదు. ఏ సినిమా తీసినా డిజాస్టర్ అయిపోతోంది. ఈనేపథ్యంలో తన మార్క్ మార్చుకొని మరీ చేసిన సినిమా ‘ మెహబూబా’.

కొడుకు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన సినిమా ఇది. సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ చూసి సినిమా పక్కా హిట్ అనే భావనకు వచ్చేశారు అందరూ. పూరీ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ కథను తెరకెక్కించాడు. ఈ చిత్రం కోసం పూరీ ఇంటిని కూడా అమ్ముకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. టీజర్, ట్రైలర్ కి రెస్పాన్స్ ఊహించని విధంగా రావడంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.

ఈ రోజు ఉదయం సినిమా విడుదల కాగా.. అంచనాలు తలకిందులయ్యాయనే మాటలు వినపడుతున్నాయి. సినిమా చూసిన సగటు ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వారి ట్వీట్ల ప్రకారం.. ఈ సినిమా ఆకట్టుకోలేదనే తెలుస్తోంది. కొంత మంది సినిమా చాలా బాగుందని ట్వీట్లు చేస్తుండగా.. ఇంకొందరు యావరేజ్ గా ఉందని చెబుతున్నారు.. మరికొందరైతే.. రంగస్థలం ఫస్ట్ డే కలెక్టన్లు కూడా ఈ సినిమా మొత్తానికి రావని చెప్పడం గమనార్హం. కొత్త అమ్మాయి అయినా.. హీరోయిన్ మాత్రం చాలా బాగా యాక్ట్ చేసిందని పలువురి అభిప్రాయం.

ఎన్నో ఆశలతో సినిమాను విడుదల చేసిన పూరీ జగన్నాథ్.. ఆశలు మరోసారి అడియాశలుగా మారిపోయినట్టేనా..? పూర్తి రివ్యూ కోసం మరికొంత సమయం ఆగాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..