సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు

By Prashanth MFirst Published Sep 24, 2019, 10:58 AM IST
Highlights

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ఆనాడు తెల్ల దొరలను ఎదురిస్తూ పలికిన మాటలు. నేటికీ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కి సంబంధించిన ఏ నాటిక విన్నా ఈ మాటలు ఖచ్చితంగా వినబడుతాయి. ఈ పలుకులు ఎంతగా అక్కడ ప్రాచుర్యం పొందాయంటే అక్కడ స్కూల్ నాటకాలలో కూడా ఈ డైలాగ్స్ వాడేంతలా!

కర్నూల్: రేయ్ పరదేశీ సంపదపై ఆశపడ్డ నీచ నికృష్ట పరాన్న భుక్కు... !.....రేయ్! ఇది ఉయ్యాలవాడలో పెరిగిన ఉక్కుగుండె. నీగుండు ఈ గుండెను చేధించలేదురా...!

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ఆనాడు తెల్ల దొరలను ఎదురిస్తూ పలికిన మాటలు. నేటికీ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కి సంబంధించిన ఏ నాటిక విన్నా ఈ మాటలు ఖచ్చితంగా వినబడుతాయి. ఈ పలుకులు ఎంతగా అక్కడ ప్రాచుర్యం పొందాయంటే అక్కడ స్కూల్ నాటకాలలో కూడా ఈ డైలాగ్స్ వాడేంతలా!

అలంటి ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి చరిత్రను సైరా నరసింహ రెడ్డి పేరుతో సినిమా తీస్తున్నారు. ఉయ్యాలవాడ పౌరుషాన్ని మనకు కళ్లకుకట్టినట్టు చూపించేది నొస్సం కోట యుద్ధం. సైరా సినిమాలో కూడా ఈ కోట దెగ్గర చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలకు చిత్ర యూనిట్ 35 రాత్రులపాటు చిత్రీకరణ జరుపుకుంది (నొస్సం యుద్ధం రాత్రిపూట జరిగింది). ఇందులో 2000మంది జూనియర్ ఆర్టిస్టులు పాలుపంచుకున్నారు. 

నొస్సం కడప కర్నూలు జిల్లాల సరిహద్దు గ్రామం. కర్నూల్ జిల్లాలోని సంజామల మండల పరిధిలోకి వస్తుంది. ఉయ్యాలవాడకు దక్షిణ దిక్కులో ఉంది. 

ప్రజలను శిస్తు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని కోవెలకుంట్ల ట్రెజరీ పై దాడి చేసి తొలి విజయాన్ని అందుకున్నాడు నరసింహ రెడ్డి. ఆ తరువాత నరసింహ రెడ్డి అందుకున్న రెండవ విజయంగా ఈ నొస్సం కోట యుద్ధం గురించి రేనాటి సూర్య చంద్రులు పుస్తకంలో పేర్కొంటారు. 

ట్రెజరీపై దాడి అనంతరం అప్రమత్తమైన నరసింహ రెడ్డి తెల్లదొరలు ఎప్పుడైనా దాడి చేయవచ్చని అప్రమత్తమవుతాడు. చుట్టుపక్కల ఊర్లలో చెరువుల్లోని నీళ్లన్నిటిని గండ్లు పెట్టించి మరీ ఖాళి చేయించేస్తాడు. 

నొస్సం కోట చుట్టూరా భారీ కందకాలు తవ్వించాడు. కోటను శత్రు దుర్భేద్యంగా మార్చుకుంటూనే చుట్టుపక్కన గ్రామాల నుంచి వీరులను సమీకరించుకుంటాడు. అవకు సంస్థానాధీశుడి సహాయం కూడా తీసుకొని ఆయుధాలను మరింత సైన్యాన్ని సమీకరిస్తాడు. 

నరసింహ రెడ్డి ఊహించినట్టుగానే అప్పటి కడప జిల్లా కలెక్టర్ కాక్రేన్, లెఫ్టనెంట్ వాట్సన్ ల నేతృత్వంలోని బ్రిటిష్ సేన దాడిచేస్తుంది. పాపం నరసింహ రెడ్డి అప్రమత్తతను, ధీరత్వాన్ని తక్కువగా అంచనా వేసినట్టున్నారు తెల్ల దొరలు. నరసింహ రెడ్డి సైన్యం వీరత్వం ముందు నిలువలేకపోయారు. 

సిద్ధంగా ఉన్న నరసింహ రెడ్డి సేన పిడుగులా ఇంగ్లీష్ సైన్యం మీదకు దూకింది. ఇంతటి పకడ్బందీ ఏర్పాట్లలో నరసింహ రెడ్డి సైన్యం ఉంటారని ఊహించని ఇంగ్లీష్ సేన చివురుటాకుల్లా వణికిపోయారు. నరసింహ రెడ్డి యుద్ధ వ్యూహరచన అలాంటిదిమరి. 

ఇంతటి భీకర యుద్ధాన్ని చిత్రీకరించడమంటే మామూలు విషయం కాదు. అందుకు తగ్గట్టుగానే సైరా టీం భారీగానే ఈ యుద్ధం పై శ్రద్ధ పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. 

click me!