చిరుకి బర్త్ డే ట్రీట్‌.. మెగాస్టార్‌ మెగా ర్యాప్‌

Published : Aug 02, 2020, 08:47 AM ISTUpdated : Aug 02, 2020, 08:51 AM IST
చిరుకి బర్త్ డే ట్రీట్‌.. మెగాస్టార్‌ మెగా ర్యాప్‌

సారాంశం

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ చిరుకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఆయనపై ఓ స్పెషల్‌ సాంగ్‌ని రూపొందిస్తున్నారు. పుట్టినరోజు కంటే ముందు రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది.  `మెగాస్టార్ మెగా ర్యాప్` పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు.

టాలీవుడ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే ఆగస్ట్ 22 అంటే ఫ్యాన్స్ కి అదొక పండుగ. దాదాపు రెండు మూడు రోజులు ఆ మూడ్‌లోనే ఉంటారు. ఇక ఆగస్ట్ నెలంతా మెగాస్టార్‌దే అనేంతగా ఆయన ఫ్యాన్స్ హడావుడి చేస్తుంటారు. ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం ఓ ఈవెంట్‌ కూడా నిర్వహిస్తుంటారు. ఈ సారి వైరస్‌ మహమ్మారి విజృంభన వల్ల అది సాధ్యమయ్యేలా లేదు. దీంతో డిఫరెంట్‌గా ఏదైనా చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. 

అందులో భాగంగా మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ చిరుకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఆయనపై ఓ స్పెషల్‌ సాంగ్‌ని రూపొందిస్తున్నారు. పుట్టినరోజు కంటే ముందు రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. `మెగాస్టార్ మెగా ర్యాప్` పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు. మెగాస్టార్‌ మెగా ర్యాప్ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. 

 ఈ నెల 21న పాటను విడుదల చేయనున్నారు. విడుదలైన మరుసటి రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని తెలిసిందే. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శివ చెర్రీ నేతృత్వంలో విడుదలైన స్పెషల్ సాంగ్ పలువురు ప్రశంసలు అందుకుంది. మెగా ర్యాప్‌కు కూడా అటువంటి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు శివ చెర్రీ చెప్పారు. ఈ సాంగ్‌కి ఫ్రీక్ మాసన్ సంగీతం అందించారు. సురేంద్ర (స్కార్పియన్) ర్యాప్ ఆలపించారు. నిఖిల్ కాన్సెప్ట్స్ వీడియో కంపోజిషన్ చేసింది. మరి ఫ్యాన్స్ కోసం చిరు ఏం గిఫ్ట్ ఇస్తారో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు